Vice President Election: దేశ‌వ్యాప్తంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నికల ప్ర‌చారం జోరుగా సాగుతోన్న వేళ‌.. మ‌రోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల చ‌ర్చ మొద‌లైంది. అయితే..ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తుది నిర్ణయం నేడు తీసుకోనున్న‌ది. ఈ త‌రుణంలో బీజేపీ ఉపరాష్ట్రపతి పదవికి మైనారిటీ ముఖాన్ని పోటీకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Vice President Election: దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నికల‌ ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. మ‌రోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన చ‌ర్చ మొద‌లైంది. ఈరోజు జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తుది నిర్ణయం తీసుకోవచ్చు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ స‌మావేశంలో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే.. ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై పలువురి పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఎన్డీయే.. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళను బ‌రిలో దించ‌డంతో... మ‌రి ఉపరాష్ట్రపతి పోరు ఏ అభ్య‌ర్థిని రంగంలోకి దింప‌వ‌చ్చ‌న‌నేది హాట్ టాఫిక్ గా మార‌నున్న‌ది. అయితే.. పదవికి మైనారిటీ వ్య‌క్తుల‌ను రంగంలోకి దింపవచ్చననే చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఏ పేర్లపై చర్చ జరుగుతోంది?

రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని బరిలోకి దింపింది. అటువంటి పరిస్థితిలో.. ఉపరాష్ట్రపతి కోసం పార్టీ మైనారిటీ ముఖాన్ని తెరపైకి తీసుకురావాలనేది బిజెపి ప్రయత్నిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

ఈ జాబితాలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ప్ర‌ధానంగా వినిపిస్తుంది. ఆయ‌న‌ను ఉప రాష్ట్రపతి పోటీకి దించవచ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. వీరితో పాటు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరు కూడా జాబితాలో ఉన్న‌ట్టు స‌మాచారం. అదే సమయంలో నజ్మా హెప్తుల్లాపై కూడా చర్చ జరుగుతోంది. 

ముస్లీమేత‌రుల ప్ర‌కారం చూస్తే.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సిక్కు లీడ‌ర్ కెప్టెన్ అమరీందర్ రంగంలో దించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇటీవ‌ల ఆయ‌న పార్టీని బీజేపీలో విలీనం చేయ‌నున్న‌ట్టు వార్తలు వెల్లువ‌డిన విష‌యం తెలిసిందే.. వీరితో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ పేరు కూడా చర్చనీయాంశమైంది. ఆయ‌న కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జాబితాలో ఉంద‌ని స‌మాచారం.

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు?

ప్రస్తుత దేశ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. ఆయన పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడానికి చివరి తేదీ జూలై 19 కాగా.. గస్టు 6న ఎన్నికలు నిర్వహించ‌బ‌డుతాయి. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల పోరులో నిలుస్తే.. ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నిక జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జ‌రుగుతోంది.