Vice President Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో WhatsAppలోనకిలీ మెసేజ్‌లు పెడుతున్నారు కొందరూ కేటుగాళ్లు. ఈ విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి తన పేరుతో WhatsApp సందేశాలను పంపడాన్ని హెచ్చరించాడు. ఇలాంటి నకిలీ సందేశాలు మరిన్ని నంబర్ల నుంచి వెలువడే అవకాశం ఉందని ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్ పేర్కొంది.
Vice President Venkaiah Naidu: శాస్త్ర సాంకేతిక రోజురోజుకీ ఎలా అభివృద్ది చెందుతుందో.. మన వ్యక్తిగత భద్రతాకు అంత ముప్పు వాటిల్లుతోంది. ఏమాత్రం ఏమార పాటుగా ఉన్నా.. తప్పుదోవ పట్టించే.. సైబర్ మోసగాళ్లు కూడా ఉంటారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు బాగా పెరుగుతున్నాయి. స్వప్రయోజనాల కోసం హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ఎంత దొరికితే.. అంత దొచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కేటుగాళ్ల కన్ను ఏకంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుపై పడింది.
తాజాగా.. సహాయం, ఆర్థిక సహాయం చేయాలంటూ.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లు పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ వ్యవహారం ఉపరాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో .. ఈ వ్యవహారంపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరుతో వస్తున్న మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. తన పేరు మీద ఆర్థిక సహాయం కోరుతూ.. వాట్సాప్ సందేశాలు వస్తే ప్రజలు పట్టించుకోవద్దని హెచ్చరించారు.
ఇక, ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చింది ఉపరాష్ట్రపతి కార్యాలయం. ఒక అధికారిక ప్రకటనలో భారత ఉపరాష్ట్రపతి M వెంకయ్య నాయుడు పేరుతో మొబైల్ నంబర్ 9439073183 నుండి సహాయం మరియు ఆర్థిక సహాయం కోరుతూ వాట్సాప్ సందేశాలను పంపుతున్నారని..వాటికి స్పందించవద్దని సూచించారు. మరిన్ని నంబర్ల నుంచి ఇలాంటి నకిలీ సందేశాలు వచ్చే అవకాశం ఉందని పత్రికా ప్రకటనలో తెలిపారు. సమస్యను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడంతో ఉపరాష్ట్రపతి సచివాలయం హోం మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. మరిన్ని నంబర్ల నుంచి ఇలాంటి నకిలీ సందేశాలు వెలువడే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలుపెరిగిపోతున్నారు.. ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నా కథనాలు తరుచు వింటునే ఉన్నాం. తాము కష్టాల్లో ఉన్నాం.. ఆర్థికంగా ఆదుకొండని లేదా కాస్త ఆర్జెంట్ ఉంది.. మళ్లీ రెండు రోజుల్లో తిరిగి ఇస్తామంటూ మయ మాటలు పెట్టి.. తప్పుడు నెంబర్లతో గుల్ల చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అలా డబ్బులు ఇచ్చి ఎంతో మందా మోసపోయారు.. అయితే, ప్రముఖులను సైతం వదలడంలేదు కేటుగాళ్లు..
