Asianet News TeluguAsianet News Telugu

Indian Navy: ఇండియన్ నేవీ నూతన చీఫ్‌గా అడ్మిరల్ హరికుమార్..

భారత నౌకదళ తదుపరి అధిపతిగా (Indian Navy chief) వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ (R Hari Kumar) నియామకం కానున్నారు. నవంబర్ 30న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Vice Admiral R Hari Kumar to be next Indian Navy chief
Author
New Delhi, First Published Nov 10, 2021, 9:37 AM IST

భారత నౌకదళ తదుపరి అధిపతిగా (Indian Navy chief) వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ (R Hari Kumar) నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఆయనను ఇండియన్‌ నేవీకి కొత్త చీఫ్‌గా నియమిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున హరికుమార్‌ ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

వైఎస్ అడ్మిరిల్ హరికుమార్.. 1962‌లో కేరళలోని తిరువనంతపురం జన్మించారు. ఆయన  1983 బ్యాచ్ అధికారి. పరమ విశిష్ట సేవా పతకం (PVSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM), విశిష్ట సేవాత పతకం (VSM) పొందారు. ఆయన కమాండ్‌, స్టాఫ్‌ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. హరికుమార్ తన 39 ఏళ్ల సర్వీసులో ఐఎన్‌ఎస్‌ నిషాంక్‌, మిస్సైల్‌ కార్వెట్‌, ఐఎన్‌ఎస్‌ కొరా, గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ రణ్‌విర్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేశారు. నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు నాయకత్వం వహించారు. 

Also read: Delhi regional security dialogue: అఫ్గాన్ పరిణామాలపై భారత్ కీలక సదస్సు.. పాక్, చైనా డుమ్మా..

వెస్ట్రన్ నావల్ కమాండ్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. హరికుమార్ హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (HQ IDS) యొక్క ఇంటిగ్రేటెడ్ స్టాఫ్ కమిటీకి చీఫ్‌గా ఉన్నారు. ముఖ్యమైన సిబ్బంది నియామకాలను నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios