అసదుద్దీన్ ఒవైసీకి వీహెచ్ పీ వార్నింగ్.. ఎందుకంటే ?

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్లపై వీహెచ్ పీ మండిపడింది. ఆయన ముస్లిం వర్గాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

VHP warning to Asaduddin Owaisi.. because?..ISR

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) హెచ్చరించింది. ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం వీహెచ్ పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ మండిపడ్డారు.

సెల్ ఫోన్ పడిపోయిందని మెట్రో ట్రాక్ పై దూకిన మహిళ.. తరువాత ఏమైందంటే ?

వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. ఒవైసీ లాంటి నేతలు ముస్లిం వర్గాల ప్రజలను పదేపదే రెచ్చగొట్టవద్దని సూచించారు. అభివృద్ధికి దారితీయని చీకటి గల్లీలోకి ముస్లిం సమాజాన్ని నెట్టేస్తున్నారని ఆరోపించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆయన వ్యాఖ్యలు చట్టపరమైన, రాజ్యాంగ పరిధి దాటాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని లీగల్ సెల్ బృందాన్ని కోరినట్లు తెలిపారు. అలాంటిదేమైనా జరిగిందని తేలితే ఈ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.

శ్రీరాముడి జన్మస్థలంలో శ్రీరాముడి బ్రహ్మాండమైన ఆలయ నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఒవైసీ వంటి కొందరు ముస్లిం నాయకుల నైరాశ్యం వేగంగా పెరుగుతోందని సురేంద్ర జైన్ ఆరోపించారు. ముస్లిం సమాజంలోని ఒక పెద్ద వర్గం ఈ గొప్ప ఆలయానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండటాన్ని చూసి వారు మరింత నిరుత్సాహానికి గురవుతున్నారని అన్నారు. అందుకే ముస్లిం సమాజంలోని ఒక వర్గాన్ని హిందువులకు వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వారిని రెచ్చగొడుతున్నారని తెలిపారు. 

మసీదు బానిసత్వానికి చిహ్నం.. దానిని కూల్చే రామ మందిర నిర్మాణం - కర్ణాటక బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఒవైసీ ఏమన్నారంటే ? 
భావ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ.. రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చేస్తున్న కార్యక్రమాల పట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘‘యువకులారా.. నేను మీకు చెబుతున్నాను. మనం మన మసీదును కోల్పోయాం. అక్కడ ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. మీ గుండెల్లో బాధ లేదా..’’ అని అన్నారు. 

మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేస్తే, మరెంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చామని ముస్లీం సమాజం గుర్తుంచుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ఇప్పుడు మన మతమే ప్రమాదంలో వుంది... కాబట్టి ముస్లిం ప్రజలంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఐకమత్యంతో వుంటేనే మన మనుగడ సాగుతుంది అనేలా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios