రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశాడు.. వివాదాస్పద వ్యాఖ్యలు, వీహెచ్‌పీ నేత అరెస్టు
రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్న తమిళనాడు వీహెచ్‌పీ మాజీ చీఫ్ ఆర్బీవీఎస్ మణియన్‌ను పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని, ఆ ఘనత రాజేంద్ర ప్రసాద్‌కు దక్కాలని అన్నాడు.

చెన్నై: తమిళనాడు వీహెచ్‌పీ మాజీ చీఫ్ ఆర్బీవీఎస్ మణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదని నోరుపారేసుకున్నాడు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించాడని కొందరు పిచ్చి ప్రేళాపనలు చేస్తారని అన్నాడు. వారి తెలివితేటలను బహుశా తాకట్టు పెట్టారేమో అని కామెంట్ చేశాడు. అంబేద్కర్ తమ కులం వాడే అని చెప్పకుంటే వారికి ఓట్లు పడవనే ఈ మాటలు మాట్లాడుతుంటారని సెప్టెంబర్ 11వ తేదీన అన్నాడు.
రాజేంద్ర ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నాడని, రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు పేరు దక్కాలని, అంబేద్కర్‌కు కాదని కామెంట్ చేశాడు. ఆయన కేవలం క్లర్క్‌గా పని చేశాడని తప్పుగా మాట్లాడాడు. ఆయన ముసాయిదా టైప్ చేసి, ప్రూఫ్ రీడింగ్ చేశాడని, ఆయన రాసిన ఒక్క క్లాజు కూడా రాజ్యాంగంలో లేదని మీకు తెలుసా? అంటూ కామెంట్ చేశాడు. రాజ్యాంగాన్ని రాసినట్టు అంబేద్కర్ కూడా ఎక్కడా తన రచనల్లో పేర్కొనలేదని
అంబేద్కర్ గురించి మాట్లాడిన తిరుమావలవన్‌ది ఏ కులం, అంబేద్కర్ ఆయన కులస్తుడేనా? అనిఆర్బీవీఎస్ మణియన్ వివాదాస్పదంగా మాట్లాడాడు. తిరుమావలవన్ ఒక పెరియార్ అని, అంబేద్కర్ చక్కిలియర్ అని పేర్కొన్నాడు. అలాంటప్పుడు అంబేద్కర్.. తిరుమావలవన్ కులస్తుడెలా అవుతాడని విడుతలై చిరుతైగల్ కాచ్చి చీఫ్ తిరుమావలవన్ గురించి కామెంట్ చేశాడు.
Also Read: Quad Summit: జీ20 తర్వాత క్వాడ్ సదస్సు.. భారత్‌లోనే నిర్వహించనున్న ప్రధాని మోడీ!
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అంబేద్కర్ పట్ల ఆయన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనపై యాక్షన్ తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
మాంబలమ్ పోలీసులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వీహెచ్‌పీ స్టేట్ మాజీ లీడర్ ఆర్బీవీఎస్ మణియన్‌ను అరెస్టు చేసినట్టు ఆయన సన్నిహితుడు ఒకడు చెప్పాడు. మణియన్ పై ఎస్సీఎస్టీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు పోలీసులు కన్ఫామ్ చేశారు.
కాగా, హిందూ మున్నాని సీనియర్ నేత ఆయన అరెస్టును ఖండించాడు. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడని వెనుకేసుకువచ్చే ప్రయత్నంచేశాడు.