సీతారాములు హిందూ దేవుళ్లు మాత్రమే కాదు భారతదేశ సాంస్కృతిక వారసత్వం : జావేద్ అక్త‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు

Javed Akhtar: రాజ్ థాకరే నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమానికి ప్రముఖ కవి, గేయరచయిత జావేద్ అక్తర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ రాముడు, సీత హిందూ దేవుళ్లు, దేవతలు మాత్రమే కాదనీ, భారతదేశ సాంస్కృతిక వారసత్వమని అన్నారు.
 

Veteran poet and lyricist Javed Akhtar asks people to chant 'Jai Siya Ram' slogans Diwali 2023 Deepotsav RMA

Javed Akhtar asks people to chant 'Jai Siya Ram': ఉదారవాద, అభ్యుదయ భావాలకు మారుపేరైన ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ హిందూ సమాజంపై ప్రశంసల జల్లు కురిపించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల వల్లే భారత్ లో ప్రజాస్వామ్యం ఉందన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక‌రే ముంబ‌యిలో దీపావ‌ళి నేప‌థ్యంలో నిర్వ‌హించిన దీపోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ జావేద్ పై వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే సమాజంలో పెరుగుతున్న అసహనంపై ఆయ‌న  ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అసహనం కలిగిన వ్యక్తులు చాలా కాలంగా అక్కడే ఉన్నారు.కానీ, హిందువులు ఒక సమాజంగా పరోపకారంతో ముందుకు సాగుతున్నార‌ని తెలిపారు.

గతంలో కొందరు ఎప్పుడూ అసహనంగా ఉండేవారన్నారు. కానీ హిందువులు అలా కాదని పేర్కొంటూ.. హిందువుల ప్రత్యేకత ఏమిటంటే, వారి హృదయాల్లో ఎప్పుడూ గొప్పతనం ఉంటుందని చెప్పారు. ఈ అద్భుతమైన లక్షణాన్ని, నాణ్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతేకాక ఇతరులు ప్రదర్శించే అసహనాన్ని అవలంబించకూడదన్నారు.  అంతేకాకుండా భారతీయులైన ఇతర మతాల వారు హిందువుల జీవన విధానం నుంచి చాలా నేర్చుకున్నారని, దాన్ని ఎవరూ వదిలిపెట్టలేరన్నారు. తనను తాను నాస్తికుడిగా చెప్పుకునే జావేద్ అక్తర్.. తాను సీతారాముల (రాముడు, సీతాదేవి) గడ్డపై జన్మించినందుకు గర్వపడుతున్నానని అన్నారు.

అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 'జై సియారామ్' నినాదాన్ని లేవనెత్తి 'రామాయణం భారతదేశ సాంస్కృతిక వారసత్వం' అని అన్నారు. సీతారాముల నినాదాల‌ను  చేయాల‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతోందనే దాని గురించి మాట్లాడుతూ.. "మీరు ఎవరినీ నమ్మకపోయినా, మీరు హిందువు, అది హిందూ సంస్కృతి , ఇది మాకు ప్రజాస్వామ్య వైఖరిని ఇచ్చింది, దీనికి విరుద్ధంగా చేయ‌డం తప్పు అని పేర్కొన్నారు. తన ప్రసంగంలో, అక్తర్ ప్రజలను ' జై సియారామ్ ' నినాదాలు చేయమని కూడా కోరారు. లక్నోలో తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, చిన్నతనంలో ధనవంతులను చూసేవాడిననీ, వారు గుడ్ మార్నింగ్ చెప్పేవారని అన్నారు. కానీ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ సామాన్యుడు మాత్రం 'జై సియారాం' అంటూ పలకరించేవాడని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios