Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో కాంగ్రెస్ నేత ఏక్‌నాథ్ గైక్వాడ్ మృతి

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత  ఏక్‌నాథ్ గైక్వాడ్  బుధవారం నాడు కరోనాతో మరణించారు. ఆయన వయస్సు 81 ఏళ్లు.  కరోనా సోకిన తర్వాత చికిత్స కోసం ఆయన ముంబైలో ఆసుపత్రిలో చేరాడు.

Veteran Congress leader Eknath Gaikwad dies of COVID-19 at Mumbai hospital lns
Author
mumbai, First Published Apr 28, 2021, 4:14 PM IST

ముంబై: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత  ఏక్‌నాథ్ గైక్వాడ్  బుధవారం నాడు కరోనాతో మరణించారు. ఆయన వయస్సు 81 ఏళ్లు.  కరోనా సోకిన తర్వాత చికిత్స కోసం ఆయన ముంబైలో ఆసుపత్రిలో చేరాడు.మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్  తండ్రి ఏక్‌నాథ్ గైక్వాడ్. ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో  కరోనాకు చికిత్స పొందుతూ  గైక్వాడ్ మరణించాడు.గైక్వాడ్ అంబేద్కర్ రైట్ బౌద్ద కుటుంబానికి చెందినవాడు. ఆయన రెండు సార్లు ఎంపీగా ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు. ధారావి నుండి ఆయన మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఇండియాలో గత 24 గంటల్లో 3,60,960 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో 1,79,97,267 కి కరోనా కేసులు చేరుకొన్నాయి.  కరోనాతో ఒక్క రోజు వ్యవధిలోనే  3,293 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య2,01,187కి చేరాయి.దేశంలో ఇంకా  29,78,709 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటికి 1,48,17,371 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత ఉందని కేంద్రానికి ఫిర్యాదులు అందుతున్నాయిదేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదౌతున్నాయి. ఈ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios