50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ 21 రాజకీయా పార్టీలు సుప్రీంకోర్టులో బుధవారం నాడు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.
న్యూఢిల్లీ: 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ 21 రాజకీయా పార్టీలు సుప్రీంకోర్టులో బుధవారం నాడు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.
ఈ నెల మొదటి వారంలో 5 ఈవీఎంలలోని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 ఈవీఎంలకు బదులుగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని 21 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఈ పార్టీలు ఇవాళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.
5 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇడివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబునాయుడు ఈ విషయమై ఢిల్లీలో పలు రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు ఇవాళ సుప్రీంకోర్టులో 21పార్టీల తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 24, 2019, 2:33 PM IST