న్యూఢిల్లీ:  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  సోమవారం నాడు భావోద్వేగానికి గురయ్యారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపే సమయంలో  వెంకయ్యనాయుడు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం నాడు తెల్లవారుజామున మృతి చెందాడు. సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పనిచేశారు. జైపాల్ రెడ్డి మృతికి పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నాడు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపాయి.

రాజ్యసభలో జైపాల్ రెడ్డి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తామిద్దరం అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.