కేరళకు నెల జీతం విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 20, Aug 2018, 3:54 PM IST
venkaiah naidu donate his first month salary to kerala people
Highlights

కేరళలో వరద పరిస్థితిపై వెంకయ్యనాయుడు డిప్యూటీ సీఎం సహా పలువురు రాజ్యసభ సభ్యులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 

భారీ వరదలతో కేరళ అతలాకుతలమైంది. ఇప్పటికే పలువురు తమకు తోచిన సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొందరు కూడా విరాళం ప్రకటించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హర్షవంశ్, ఇతర రాజ్యసభ సభ్యులు తమ నెలరోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. 

కేరళలో వరద పరిస్థితిపై వెంకయ్యనాయుడు డిప్యూటీ సీఎం సహా పలువురు రాజ్యసభ సభ్యులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సీనియర్ అధికారులు, ఉపరాష్ట్రపతి సచివాలయ అధికారులు, ఐవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 మరోవైపు శివసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కేరళ సహాయనిధికి నెలరోజుల వేతనాన్ని ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీలు సైతం తమ నెలరోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.

loader