మద్యం తాగొద్దని అన్నందుకు ఓ దుండగుడు కూరగాయలమ్ముకునే  వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. 

ఆగ్రా : తన బండి దగ్గర మద్యం తాగొద్దని చెప్పినందుకు ఓ కూరగాయల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. రవి కుమార్ అనే బాధితుడి వయసు 32 సంవత్సరాలని అతడిని దుండగుడు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆగ్రా జిల్లాలోని ఇత్మద్-ఉద్-దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ సయీద్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఉదయం 10 గంటల సమయంలో మనోజ్ దివాకర్ (28) అనే వ్యక్తి మరో నలుగురు వ్యక్తులతో కలిసి బండిపై వచ్చి.. పదునైన ఆయుధంతో రవి కుమార్ ఛాతీపై కత్తితో పొడిచి చంపాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి చెందినట్లు ఎస్‌ఎన్‌ వైద్య కళాశాల వైద్యులు నిర్థారించారు. కాగా, నిందితుడు దివాకర్‌ను అరెస్టు చేసినట్లు ఇత్మద్-ఉద్దౌలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు.

సత్ప్రవర్తన వల్లే బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల.. సుప్రీంకోర్టులో తన నిర్ణయాన్ని సమర్థించిన గుజరాత్ ప్రభుత్వం

బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, "రవి తన ఇంటి సమీపంలో బండిపై కూరగాయలు అమ్మేవాడు. స్థానికంగా దాదాగా పేరున్న మనోజ్ రోడ్డు పక్కన వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేసేవాడు. సోమవారం, అతను అలాగే రవికుమార్ దగ్గరికి వచ్చాడు. తనకు నమిలే పొగాకు ఇవ్వమని అడిగాడు. అయితే రవికుమార్ తన దగ్గర పొగాకు లేదని చెప్పాడు. దీంతో కోపానికి వచ్చిన మనోజ్ నువ్వు ఇక్కడ కూరగాయలు ఎలా అమ్ముతావో చూస్తా అంటూ బెదిరించాడు. 

ఆ తర్వాత మనోజ్ కూరగాయల బండి వెనుక నిలబడి మద్యం సేవించడం ప్రారంభించాడు. అతను అలా తాగుతుంటూ తన దగ్గరికి కూరగాయలు కొనడానికి ఎవ్వరూ రారని భావించిన రవికుమార్.. అక్కడ మద్యం తాగొద్దని మనోజ్ కు చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

కోపంతో అక్కడినుంచి వెళ్లిన మనోజ్ కత్తితో, నలుగురు స్నేహితులతో తిరిగి వచ్చి రవి ఛాతీపై పొడిచాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే ఏ హాస్పిటల్ కు వెళ్లినా చికిత్స అందించడానికి నిరాకరించడంతో.. వారు నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో చివరగా అతనిని ఎస్ఎన్ మెడికల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రవికి, భార్య ఐదుగురు పిల్లలున్నారు. 

వీరంతా చిన్నవారే. ఇంట్లో రవి ఒక్కడే సంపాదన పరుడు... అని బంధువులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మనోజ్ దివాకర్‌తో పాటు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఇత్మద్ ఉద్ దౌలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవికి ఐదుగురు పిల్లలు (ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు), భార్య, అతని తల్లి ఉన్నారు. విచారణ కొనసాగుతోందని ఎస్‌హెచ్‌వో తెలిపారు.