Asianet News TeluguAsianet News Telugu

ప్రింటింగ్ పొరపాటు.. భారత్ జోడో యాత్ర ఫెక్సీల్లో సావర్కర్ ఫోటో..

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో  ఓ  ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పార్టీ నాయకులు రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాతంత్ర యోద్యమ నాయకుల ఫెక్సీలో సావర్కర్ ఫోటో ప్రత్యక్షం కావడం కలకలం రేగింది. 

Veer Savarkar's photo among freedom fighters in 'Bharat Jodo Yatra' poster
Author
First Published Sep 22, 2022, 2:20 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం కేరళ మీదుగా సాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. అయితే.. కేరళలోని అలువాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీకి స్వాగతం పలుకేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ పార్టీ నాయకులు చేసిన ఓ ఫెక్సీ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. 

వివరాల్లోకెళ్తే.. భారత్ జోడో యాత్ర 14 వ రోజు ఎర్నాకులం చేరుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకేందుకు కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు  స్వాతంత్ర్య సమరయోధులతో కూడిన  ఏర్పాటు పోస్టర్‌ ను ఏర్పాటు చేశారు.అయితే.. ఆ స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోల వరుసలో సావర్కర్ (Savarkar) ఫోటో కూడా ఉంది. ఈ ఫెక్సీని చూసి అందరూ షాకయ్యారు. కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ సావర్కర్ స్వాతంత్ర్య యోధుడు కాదని, ఆయన బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పుతోంది. ఈ క్రమంలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోల వరుసలో సావర్కర్ ఫోటో ప్రత్యక్షం కావడం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం సావర్కర్‌కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఈ విషయాన్ని తొలుత గుర్తించిన స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్.. ఆ ఫెక్సీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో సావర్కర్ ఫోటోతో పాటు గోవింద్ బల్లభ్ పంత్,చంద్రశేఖర్ ఆజాద్ ఫోటో కూడా పోస్టర్‌పై ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. జరిగిన పొరపాటును గుర్తించిన కాంగ్రెస్ నాయకులు హడావుడిగా వీర్ సావర్కర్ చిత్రాన్ని తొలగించి.. ఆ స్థానంలో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని ఫేస్ట్ చేశారు. 

వీర సావర్కర్‌ను స్వాతంత్ర సమరయోధుడనీ, ఇప్పటికైనా ఆ విషయాన్ని కాంగ్రెస్ గ్రహించి సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడుగా రాహుల్ గాంధీ గ్రహించారని, చరిత్రను ఎవరూ కనుమరుగు పరచలేరని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.

వింత ఘటనపై కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఇది ప్రింటింగ్ సమయంలో జరిగిన పొరపాటని వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ కె.సురేష్ మాట్లాడుతూ.. బ్యానర్‌ను ముద్రించిన వ్యక్తి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన వ్యక్తి అయి ఉంటాడని, ఉద్దేశ్యపూర్వకంగానే అలా చేశాడని.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎప్పుడూ సావర్కర్‌ ఫొటోను బ్యానర్‌పై వేయరని తెలిపారు. ఈ ఘటనపై విచారిస్తామని తెలిపారు. నాయకత్వం చర్య తీసుకుంది. వెంటనే స్థానిక నాయకుడిని సస్పెండ్ చేసింది.

ఇదిలావుండగా.. సస్పెండ్ అయిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు సురేష్ మాట్లాడుతూ "యాత్ర కోసం రెండు వారాలుగా పనిచేస్తున్నాను.మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో కూడిన ఫ్లెక్స్ ప్రచురణ కోసం ఇచ్చాము. 22 చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీయబడ్డాయి. డెమో పంపారు, కానీ నేను పూర్తిగా తనిఖీ చేయలేదు, అది నా తప్పే అని అన్నారు. భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు సాగుతుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్రలో 3,570 కిలోమీటర్లు పాదయాత్ర,150 రోజుల పాటు సాగునున్నది. ఈ  యాత్ర జమ్మూ లో ముగియనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios