షూస్ అమ్మి కోట్లు సంపాదిస్తున్న స్కూల్ డ్రాపవుట్.. వేదాంత్ లంబా సక్సెస్ స్టోరీ ఇది
స్కూల్ డ్రాపవుట్ అని ఆగిపోలేదు. అతను కాలేజీకి మొత్తమే వెళ్లలేదు. అయినా కూడా తనకు ఇంట్రెస్ట్ ఉన్న పనిచేస్తూ కోట్లను సంపాదిస్తున్నాడు. ఏదేమైనా పట్టుదల ఉంటే ఇప్పుడు కాకపోయినా.. ఫ్యూచర్ లో తప్పకుండా విజయం సాధిస్తారు. దీన్ని ఇతను నిజం చేశారు.
వేదాంత్ లంబా కథ ఎంతో ప్రత్యేకమైనది. స్కూల్ చదువు పూర్తయ్యాక మెయిన్ స్ట్రీట్ టీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మెయిన్ స్ట్రీట్ మార్కెట్ ప్లేస్ పేరుతో పూర్తి స్థాయి స్టార్టప్ గా ఈ ఛానల్ ను అభివృద్ధి చేశాడు. కొన్నేళ్లుగా ఆయన కంపెనీ అద్భుతమైన గణాంకాలను నమోదు చేసింది. లాంబాకు స్కూల్లో ఉన్నప్పుడు స్నీకర్స్ గురించి పెద్దగా తెలియదు. అయితే 16 ఏళ్ల వయసులో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రపంచాన్ని కనిపెట్టాడు. వేదాంత లంబా కాలేజీకి వెళ్లలేదు. ఒకసారి తాను హైస్కూల్ డ్రాపవుట్ అని ట్వీట్ చేశాడు. 2005 నుంచి 2010 వరకు పుణెలోని సెయింట్ మేరీస్ స్కూల్లో ఇతను చదువుకున్నారు.
17-19 ఏళ్ల వయసున్న చాలా మంది పిల్లలకు పాత బూట్లను అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. రూ.20 వేలతో వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇతను సంపాదిస్తున్నాడు.
వేదాంత లాంబా 2017లో లైఫ్ స్టైల్ వ్లాగ్ నడపడానికి యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. రెండేళ్లుగా ఆ ఛానల్ పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. అయినా ఏ మాత్రం భయపడలేదు. ఇంకేముంది స్నీకర్స్ పై తనకున్న మక్కువనే తన వృత్తిగా మార్చుకున్నాడు. మెయిన్ స్ట్రీట్ మార్కెట్ ప్లేస్ అనే ఆన్ లైన్ స్నీకర్ స్టోర్ ను ప్రారంభించాడు. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ స్నీకర్ హెడ్స్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
లంబా వయసు 24 ఏండ్లు. అతని సంస్థ ఇప్పుడు స్నీకర్స్, టీ-షర్టులు, హూడీలతో సహా 3000 ఉత్పత్తులను జనాలకు అందిస్తోంది. ముంబైకి చెందిన ఈ స్టార్టప్స్ నెలవారీ ఆదాయం రూ.5 కోట్లు దాటింది. జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరుల నుంచి ఇతను 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించారు. ర్యాపర్ బాద్ షా కూడా దీనిలో పెట్టుబడి పెట్టాడు.
రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు తన కస్టమర్లే అని లాంబా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా ఇప్పటివరకు 50000 పైగా స్నీకర్లను విక్రయించింది. ఈ కంపెనీకి ముంబైలో రెండు స్టోర్లు ఉన్నాయి. మరో నాలుగు ఫిజికల్ స్టోర్లను ప్రారంభించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 24 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.