వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ఆవు అడ్డు వచ్చింది. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. 

పట్నా నుంచి రాంచీకి ట్రయల్ రన్‌గా వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ముప్పు తప్పింది. బర్నక్నా స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురుగా ఓ ఆవు వచ్చింది. దీంతో లోకో పైలెట్ అప్రమత్తమై బ్రేకులు వేసి రైలును ఆపాడు. ఇది గమనించిన రైలులో ఉన్న సిబ్బంది వెళ్లి... ఆ ఆవును పక్కకు పంపించారు. దీంతో ప్రారంభోత్సవానికి ముందే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది.