Davanagere: ధార్వాడ్-బెంగళూరు నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన కేసులో ఇద్దరు మైనర్ బాలురను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను చిత్రదుర్గ అబ్జర్వేషన్ హోమ్లో ఉంచినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తెలిపారు. 

Dharwad-Bengaluru Vande Bharat Train: కర్ణాటకలో వందేభారత్ పై రాళ్లు రువ్విన ఇద్దరు బాలురను సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలురు రాళ్లు రువ్వడంతో రైలు అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వివ‌రాలను రైల్వే అధికారులు తెలుపుతూ.. ధార్వాడ్-బెంగళూరు నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన కేసులో ఇద్దరు మైనర్ బాలురను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను చిత్రదుర్గ అబ్జర్వేషన్ హోమ్లో ఉంచినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తెలిపారు.

వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ పై బాలురు రాళ్లు రువ్విన ఘ‌ట‌న జూలై 1న జ‌రిగింది. ఈ రాళ్ల‌దాడి చేసిన బాలుర‌ను ఎస్.ఎస్.నాగర, బాషాగా గుర్తించారు. బాలురు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రెండో వందేభారత్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26న జెండా ఊపి ప్రారంభించారు. వారం త‌ర్వాత వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల‌దాడి జ‌ర‌గడంతొ ప్రయాణికులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే రాళ్ల‌దాడి చేసిన ఇద్ద‌రు మైన‌ర్ బాలుర‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలావుండ‌గా, వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి ఘ‌ట‌న‌లో ఇటీవ‌ల చాలానే జ‌రిగాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన పశ్చిమబెంగాల్లోనూ జ‌న‌వ‌రిలో చోటుచేసుకుంది. హౌరా నుంచి న్యూ జల్పాయిగురి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. మాల్దా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అద్దాలు పగిలిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.