Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో పశువులను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. 2 నెలల్లో 4వ సంఘటన

Gandhinagar: గుజ‌రాత్ లో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ ప‌శువుల‌ను ఢీ కొట్టింది. రెండు నెల‌ల్లో ఇది 4వ సంఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. ముంబ‌యి-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అహ్మదాబాద్‌లోని వత్వా-మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య మొద‌టిసారి ప్రమాదానికి గురైంది.
 

Vande Bharat Express collided with cattle in Gujarat.. 4th incident in 2 months
Author
First Published Dec 2, 2022, 1:58 AM IST

Vande Bharat Express: గుజ‌రాత్ లో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప‌శువుల‌ను ఢీ కొట్టింది. రెండు నెల‌ల్లో ఇది 4వ సంఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకెళ్తే.. గాంధీనగర్-ముంబ‌యి వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం గుజరాత్‌లోని ఉద్వాడ-వాపి రైల్వే స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టినట్లు రైల్వే అధికారి తెలిపారు. ప‌శువుల‌ను ఢీకొనడంతో రైలు ముందు ప్యానెల్‌కు చిన్నపాటి డెంట్‌ ఏర్పడిందని ఆయన తెలిపారు. రెండు నెలల క్రితం సెమీ-హై స్పీడ్ రైలు నడపటం ప్రారంభించిన తర్వాత ఇది నాల్గవ సంఘటన కావ‌డం గ‌మ‌నార్హం. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ ఉద్వాడ-వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పారు.

"ముందు భాగంలో ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా చిన్న డెంట్ ఏర్ప‌డింది. ఈ రాత్రికి డెంట్ అటెండ్ చేయబడుతుంది" అని  సుమిత్ ఠాకూర్ చెప్పారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత, రైలు సాయంత్రం 6.35 గంటలకు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపారు. అయితే, వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ కు సంబంధించి వ‌రుసగా ప‌శువుల‌ను ఢీకొడుతున్న‌ ఘ‌ట‌న‌లు జ‌రుగుతుండటంతో అధికారులు వీటిని నివారించ‌డానికి చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు.

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు తొలి ప్ర‌మాదం.. 

ముంబ‌యి-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అహ్మదాబాద్‌లోని వత్వా-మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య మొద‌టిసారి ప్రమాదానికి గురైంది. రైలు ముందు భాగం గేదె ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత పర్యాటకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాని రైలు ముందుభాగం అధికంనే దెబ్బ‌తిన్న‌ది. 

మరుసటి రోజే ఆనంద్ ప్రాంతం దగ్గర రెండో ప్రమాదం..

అక్టోబరు 7న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆనంద్ సమీపంలో మరో ప్రమాదానికి గురైంది. వందే భారత్ రైలు నదియాడ్-ఆనంద్ మధ్య బోరియావి కంజారి స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపైకి ఒక్కసారిగా ఆవు రావ‌డంతో రైలు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో రైలుకు స్వల్ప నష్టం వాటిల్లింది, అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడో ప్రమాదం వ‌ల్సాద్ లో.. 

అక్టోబర్ 29న వందేభారత్ రైలు మూడోసారి ప్రమాదానికి గురైంది. వల్సాద్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదానికి గురైంది.రైలు ఎద్దును ఢీకొనడంతో ఇక్కడ ప్రమాదం జరిగింది. ఇందులో రైలు ముందు భాగం విరిగిపోవడంతో పాటు ఇంజన్ కూడా దెబ్బతింది. 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాలుగో ప్రమాదం..

నవంబర్ 8న ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ముంబ‌యికి వెళ్లే సెమీ-హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని 54 ఏళ్ల మహిళ మరణించింది. బాధితురాలిని బీట్రైస్ ఆర్చిబాల్డ్ పీటర్‌గా గుర్తించినట్లు రైల్వే అధికారి తెలిపారు. సాయంత్రం 4.37 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో మహిళ ట్రాక్ దాటుతున్నదని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios