Asianet News TeluguAsianet News Telugu

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. కోచ్‌ల అద్దాలు ధ్వంసం

పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతం నుంచి న్యూ జల్‌పైగురి వైపు వెళ్తున్న రైలు కిటికీ అద్దాలు రాళ్లదాడితో ధ్వంసమయ్యాయి.

Vande Bharat Express attacked with stones in West Bengal
Author
First Published Jan 4, 2023, 5:01 AM IST

ప్రధాని మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతం నుంచి న్యూ జల్‌పైగురి వైపు వెళ్తున్న రైలు సీ-3, సీ-6 కోచ్‌ల కిటికీల అద్దాలు రాళ్లదాడితో ధ్వంసమయ్యాయి. ఈ సమాచారాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) మంగళవారం అందించింది. జనవరి 3..  సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నంబర్- 22302) తనిఖీ చేస్తుండగా, రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ప్రారంభించిన రెండు రోజుల్లో ఇది రెండో ఘటన జరగడం గమనార్హం

ఇంతకు ముందు కూడా రాళ్ల దాడి 

హౌరా , న్యూ జల్పాయిగురిలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో సోమవారం (జనవరి 2) రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారి తెలిపారు. మాల్దా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని కుమార్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపై ఈ రాళ్ల దాడి జరిగింది.

ఈ ఘటనలో 22303 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కంపార్ట్‌మెంట్ నంబర్ సి-13 అద్దం పగిలింది. ఈ సంఘటన సోమవారం (జనవరి 2) సాయంత్రం 5.10 గంటలకు జరిగిందని, రైలును మధ్యలో ఆపలేదని, షెడ్యూల్ ప్రకారం మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌లో ఆగిందని అధికారి తెలిపారు. ఈ విషయమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) దర్యాప్తు చేస్తోందని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) ఐసి ప్రశాంత్ రాయ్ తెలిపారు.

డిసెంబర్ 30న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం 

హౌరా,  న్యూ జల్పాయిగురిలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 30, 2022న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఘటన కొద్దిరోజుల తర్వాత ఈ దాడి వెలుగులోకి వచ్చింది. భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 'అమృత్ మహోత్సవ్'లో, దేశం 475 'వందే భారత్ రైలు'ను ప్రారంభించాలని సంకల్పించిందని ప్రధాని మోదీ చెప్పారు. నేడు హౌరా, న్యూ జల్‌పైగురిని కలుపుతూ 'వందే భారత్' ఒకటి ప్రారంభమైంది అని ప్రధాని పేర్కొన్నారు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై గతంలోనూ రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. ఇంతకు ముందు కూడా సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. 15 డిసెంబర్ 2022న ఛత్తీస్‌గఢ్‌లోని నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీని కారణంగా రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దుర్గ్ మరియు భిలాయ్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.  ఇంతకు ముందు కూడా సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. 15 డిసెంబర్ 2022న ఛత్తీస్‌గఢ్‌లోని నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలోనూ  రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios