ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు దానికి వారం రోజుల ముందు నుండి హగ్ డే, కిస్ డే, ప్రపోసల్ డే అంటూ వారం రోజుల ముందు నుండి హడావుడి మొదలవుతుంది. ప్రేమికులంతా తమ ప్రేయసి, ప్రియుళ్ళతో ఎలా గడపాలో ప్లాన్స్ వేసుకుంటూ బిజీగా ఉంటారు. 

ఎన్ని వేడుకలు చేసుకునేందుకు సిద్ధపడ్డప్పటికీ ప్రేమికులకు బయట బహిరంగ ప్రదేశాల్లో కలుసుకోవడానికి మాత్రం ఒకింత భయపడుతూనే ఉంటారు. దానికి కారణం భజరంగ్ దళ్, విశ్వా హిందూ పరిషత్ లాంటి సంస్థలు. ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు పార్కుల్లోకి వచ్చి ప్రేమికులు కనబడితే వారికి పెండ్లిళ్లు చేపించడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాము. 

ఇలా ఈ  ప్రేమికుల దినోత్సవం రోజు బయట కలుసుకోవాలంటేనే ప్రేమికులు బెంబేలెత్తిపోయేవారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికులకు పెళ్లిళ్లు చేయబోమని స్పష్టం చేసారు. 

Also read: వాలంటైన్స్ డే స్పెసల్ : ఇలా ప్రపోస్ చూయండి మీరు ప్రేమించే వ్యక్తికి...!

గత సంవత్సరం అదే ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడి జరిగిన నేపథ్యంలో... ఆ దాడిలో మృతిచెందిన సైనికుల స్మృత్యర్థం ఈ ఫిబ్రవరి 14ను వారి స్మృతి దినంగా జరుపుతామని వారు చెప్పారు. ప్రతి పార్కు వద్ద కూడా అందుకు సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసి వారికి నివాళులు అర్పిస్తామని వారు తెలిపారు. 

ఎవరైనా ప్రేమికులు గనుక పార్కుల్లో కనబడితే... వారికి పెళ్లిళ్లు మాత్రం చేయబోమని, వారి చేత కూడా పుల్వామా వీరులకు నివాళులు అర్పింపచేస్తామని తెలిపారు. పెండ్లి చేయకున్నా కూడా ప్రేమికులకు మాత్రంయధావిధిగా మన సంస్కృతిని నాశనం చేయకూడదంటూ కాన్సెలింగ్ మాత్రం ఇస్తామని వారు తెలిపారు. 

సో మొత్తానికి ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఇక ప్రేమికులు సంతోషంగా బయట తిరగొచ్చన్నమాట. ఈ న్యూస్ తో ఇప్పుడు ప్రేమికులు సంబరాలు చేసుకుంటున్నారు.