Sologamy Marriage: గుజరాత్ లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకుబోతుంది. ఈ విచిత్రమైన పెళ్లి జూన్ 11 న జరగనున్నది. అనంతరం.. ఓ వారం రోజుల పాటు గోవాకు వెళ్లనున్నది.
Sologamy Marriage: పెళ్లంటే.. వధువు, వరుడు, పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్లు, ఏడు అడుగులు.. ఇలా ఇరువురి బంధువులు, స్నేహితుల మధ్య నిర్వహించుకునే.. జీవితాంతం గుర్తుండే మధుర ఘట్టం. అయితే.. ట్రెండ్ మారుతున్న కొన్ని సందర్భాల్లో అమ్మాయి, అబ్బాయి, ఓ పసుపుతాడు ఉంటే చాలు.. పెద్దలు ఎవరూ లేకపోయినా పెళ్లిళ్లు అయినా.. సందర్భాలు చాలా చూశాం.. కానీ ఇప్పడు ప్రస్తవించే పెళ్లి మాత్రం.. అందుకు చాలా విభిన్నం .. చాలా ప్రత్యేకం.. అబ్బా ఆ పెళ్లిలో అంతా స్పెషలేంటో అనుకుంటున్నారా..? ఈ పెళ్లిలో ఓ యువతి.. వరుడు లేకుండానే వివాహం చేసుకోబోతుంది. ఏంటీ.. వరుడు లేకుండా పెళ్ళేంటీ? అని అనుకుంటున్నారా..? అదే ఈ పెళ్లిలో స్పెషల్...
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ లోని వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు.. అనే యువతి స్వీయ వివాహం చేసుకోబోతుంది. సాధారణ వివాహం మాదిరిగానే ఈ వివాహం కూడా సంప్రదాయబద్దంగా జరుపుకోనుంది. జూన్ 11న జరిగే ఈ పెళ్లిలో వరుడు తప్పా.. అన్ని సాంప్రదాయ ఆచారాలు ఉంటాయట. ఇటువంటి పెళ్లి జరగడం దేశంలో మొదటిసారి. ఇప్పుడు ఈ పెళ్ళి విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై క్షమా బిందు మాట్లాడుతూ.. తనకు.. ఎవర్నో పెళ్లి చేసుకోని.. వారికి నచ్చినట్టు ఉండటం,.. తనకు ఇష్టం లేదంటూ ఆమె.. నాకు మాత్రం వధువులా తయారు కావాలని ఉంది.. అందుకే ఇలా నన్ను నేనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నని అంటోంది. అంతేకాదు, ఇంతకు ముందు దేశంలో ఎవరైనా ఇలా చేశారా? అని ఆన్‌లైన్‌లో వేదికినా వివరాలు రాలేదని, బహుశా తానే మొదటి వ్యక్తిని కావచ్చని అన్నారు.
‘‘స్వీయ-వివాహం అనేది.. మన కోసం ఉండాలనే నిబద్ధత.. మన మీద మనకు హద్దులు లేని ప్రేమ.. ఇది కూడా స్వీయ అంగీకార చర్య.. కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ, నన్ను నేను ప్రేమిస్తున్నాను.. అందుకే స్వీయ వివాహమని వివరించారు.
అయితే.. ఇటువంటి వివాహమనేది.. అసందర్భమైందని అంటారు కానీ, సమాజానికి స్త్రీలు ముఖ్యమని తెలియజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాననీ పేర్కొన్నారు. అంతేకాదు, నా తల్లిదండ్రులు విశాలమైన భావాలు కలిగినవారని, తన పెళ్లికి వారి దివ్వెనలున్నాయని అన్నారు. క్షమా గోత్రిలోని ఆలయంలో పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్లాలన్నది.
