ఆ విషయం ఆమె తన భర్త దగ్గర దాచిపెట్టింది. కానీ.. ఆ తర్వాత ఆ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇంకేముంది.. వెంటనే విడాకులకు అప్లై చేశాడు.
సాధారణంగా మహిళలు పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి శుభకార్యాల్లో పాల్గొనరు. అలాంటిది ఓ మహిళ ఏకంగా.. పీరియడ్స్ లో పెళ్లి చేసుకుంది. ఆ విషయం ఆమె తన భర్త దగ్గర దాచిపెట్టింది. కానీ.. ఆ తర్వాత ఆ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇంకేముంది.. వెంటనే విడాకులకు అప్లై చేశాడు. ఈ సంఘటన వడోదరలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వడోదరాలకు చెందిన ఓయువకుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గత జనవరిలో టీచర్ గా పనిచేసే ఓ యువతితో వివాహం జరిగింది. వధువు సరిగ్గా పెళ్లిరోజు వధువుగా ఉన్న ప్రస్తుత భార్య నెలసరిలో ఉండి వివహాం చేసుకుంది. ఆ విషయాన్ని వివామం జరిగిన తరువాత ప్రత్యేక పూజ కోసం ఓ దేవాలయంలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు తన భార్య తాను ‘బహిష్టు’లో ఉన్నానని చెప్పింది.
దాంతో అతను అతని తల్లి గొడవ చేశారు. పెళ్లిని అపవిత్రం (బహిష్టు) సమయంలో చేసుకోవటం చాలా చాలా పాపం అని అన్నారు. ఆ గొడవ సర్ధుమణగలేదు. విడాకుల వరకూ వెళ్లింది. రుతుక్రమంలోనే తనను పెళ్లి చేసుకుందని ఇది తమ విశ్వాసాలకు భంగం కలిగించే అత్యంత పెద్ద విషయం అని ఈ భార్య నాకొద్దు అంటూ విడాకులకు అప్లై చేశాడు. ఆ విషయం ఒక్కటే విడాకులు మంజూరు కోసం సరిపోదని సదరు భర్త వివాహం జరిగిన నాటి నుంచి అస్తమానం ఆమె తనతో ఏదో ఒక గొడవపెట్టకుని పుట్టింటికి వెళ్లిపోతుందని అతడు తన పిటిషన్‌లో ఆరోపించాడు.
కానీ ఆ యువతి మాత్రం ఇదో పెద్ద విషయమే కాదు..దీని కోసం విడాకులు కోరటమేంటంటూ ప్రశ్నిస్తోంది. అసలు విషయం తాను బహిష్టు సమయంలో వివాహం చేసుకున్నందుకు కాదనీ..తన వివాహం జరిగిన తరువాత కూడా టీచర్ గా పనిచేసే తన జీతంలోంచి తన అన్నకు ప్రతీ నెలా రూ.5వేలు ఇస్తున్నానని అందుకు తన భర్తా, అత్తింటివారి గొడవచేస్తున్నారని తెలిపింది. తన పెళ్లికి చేసిన ఖర్చులతో చాలా అప్పుల పాలయ్యాడని దానికి తన వంతుగా సహాయం చేయటానికి ప్రతీ నెలా రూ.5వేలు ఇస్తున్నానని ఆ విషయం తన భర్తకు., అత్తింటివారికి నచ్చగా ఇలా రుతుక్రమంలో పెళ్లి చేసుకున్నాననే వంకతో విడాకులు కోరుతున్నారంటూ వాపోయింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 28, 2020, 12:37 PM IST