న్యూఢిల్లీ: 18 ఏళ్లు నిండినవారంతా కరోనా వ్యాక్సిన్ కోసం  ఈ నెల 24 నుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని  నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ తెలిపారు.  కోవిన్ యాప్ ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం 45 ఏళ్లు దాటినవారు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో  అడిగే సర్టిఫికెట్లను  18 ఏళ్లు దాటినవారు సమర్పించాల్సి ఉంటుంది.  

also read:గుడ్‌న్యూస్: వ్యాక్సిన్ తీసుకొన్న 10 వేలమందిలో నలుగురికే కోవిడ్

ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్  వ్యాక్సిన్లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గాను  ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఈ ఏడాది మే 1వ తేదీ నుండి  18 ఏళ్లు నిండిన వారికి  వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు  కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని  కేంద్రం సూచించింది.ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లను  50 శాతం కేంద్రానికి, మిగిలిన 50 శాతం బహిరంగ మార్కెట్లో విక్రయించుకొనే వెసులుబాటును కల్పించింది. కేంద్రం .