భారత ప్రభుత్వం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాలు.. మార్గదర్శకాలు సంబంధిత వ్యక్తి సమ్మతి పొందకుండా బలవంతంగా టీకాలు వేయకూడదని అఫిడవిట్ సమర్పించబడింది. అంతేకాదు ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ఇంత స్థాయిలో జరుగుతుందని తెలిపింది. 

న్యూఢిల్లీ : ఒకరికి ఇష్టం లేకుండా Corona vaccination ఇవ్వాలని ఏ covid clauseలోనూ లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన covid-19 Vaccine Guidelines ప్రకారం వ్యక్తి సమ్మతి లేకుండా.. Forcedగా టీకాలు వేయకూడదని ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Disability personsకు టీకా ధృవీకరణ పత్రాల్లో మినహాయించే అంశంపై జరిగే విచారణలో ఈ విషయాన్ని పేర్కొంది. అంతేకాదు ఏ ఉద్దేశానికైనా Vaccine certification documentని తీసుకెళ్లడాన్ని తప్పనిసరి చేసే SOP ఏదీ జారీ చేయలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

NGO Evara Foundation కు కౌంటర్ గా వేసిన అఫిడవిట్ లో కేంద్రం ఈ విషయాన్ని జోడించింది. ఎన్‌జిఓ ఎవారా ఫౌండేషన్ వికలాంగులకు డోర్ టు డోర్ తిరిగి కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను ఇస్తామని.. అందుకు అంగీకరించాలని చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.

"భారత ప్రభుత్వం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాలు.. మార్గదర్శకాలు సంబంధిత వ్యక్తి సమ్మతి పొందకుండా బలవంతంగా టీకాలు వేయకూడదని ఇది సమర్పించబడింది. అంతేకాదు ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ఇంత స్థాయిలో జరుగుతుందని తెలిపింది. మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

అంతేకాదు ‘పౌరులందరూ టీకాలు వేసుకోవాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా లాంటి వార్తా మాధ్యమాల్లో సలహాలు, ప్రచారం, కమ్యూనికేట్ చేస్తున్నామని, ప్రకటనలు ఇస్తున్నామని దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ సులభతరం అవుతోందని... మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా టీకాలు వేసుకోమని ఏ వ్యక్తిని బలవంతం చేయలేం.. అని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇదిలా ఉండగా, క‌రోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తి అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ దేశవ్యాప్తంగా 157.70 కోట్ల డోస్‌లను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారంనాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈ రోజు ప్ర‌త్యేక‌మ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. 

ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. వయోజన జనాభాలో దాదాపు 93% మంది మొదటి డోస్‌, 70% వ‌యోజ‌నల‌కురెండవ డోస్ టీకాలు వేయించుకున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభించబడింది. కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ అనే మూడు వ్యాక్సిన్ల‌ను ఈ డ్రైవ్ లో ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో గత ఏడాది అక్టోబర్ 21న 100 కోట్ల మార్కును దాటింది, అలాగే.. జనవరి 7న 150 కోట్ల మార్కు దాటింది. సెప్టెంబర్ 17, 2021న అత్యధికంగా 2.5 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.