భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ముందుగా కరోనా వారియర్లుగా వున్న ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తారు. వీరంతా కలిపి సుమారు 3 కోట్ల మంది ఉంటారని అంచనా. ఆ తర్వాత 50 ఏళ్ల పైబడినవారికి, ఆతర్వాత 50 ఏళ్ల తక్కువ వయసున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.