ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి.. మృతదేహాన్ని గొడలితో ముక్కలుగా నరికి..
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్‌లో భర్త హత్య కేసులో భార్యను అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసిన తర్వాత భార్య మృతదేహాన్ని ఐదు భాగాలుగా నరికి చంపింది. అనుమానంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను అడ్డు తొలిగించుకునేందు ప్రయత్నించింది. ఈ క్రమంలో హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. అంతటితో మృతదేహా ముక్కలను సమీపంలోని కాలువలో విసిరిసింది. ఈ కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను నరికివేసే ముందు ఆ మహిళ మంచానికి కట్టేసింది. మృతుడు గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన 55 ఏళ్ల రామ్‌పాల్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
రామ్ పాల్ భార్య దులారో దేవి ఇటీవల తన భర్త స్నేహితుడితో కలిసి పారిపోయింది. నెల రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన ఆమె భర్త అదృశ్యమైన విషయాన్ని కుమారుడికి తెలియజేసింది. తన భార్య, పిల్లలతో కలిసి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న రామ్ పాల్ కుమారుడు సోన్ పాల్ పోలీస్ స్టేషన్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు దులారో దేవిని అదుపులోకి తీసుకుని ఆమె భర్త గురించి ప్రశ్నించారు.
పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న భార్య
పోలీసుల విచారణలో రామ్ పాల్ భార్య దులారో దేవీ నేరాన్ని అంగీకరించింది. ఆదివారం రాత్రి నిద్రలో రామ్ పాల్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పింది. శరీర భాగాలను సమీపంలోని కాలువలో పడేసినట్లు దులారో దేవీ పోలీసులకు తెలిపింది. రామ్ పాల్ శరీర భాగాలను వెలికితీసేందుకు డైవర్ల సహాయం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కాలువలో మృతుని రక్తపు మరకలు లభ్యమయ్యాయి. అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
తల్లిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు
ఈ కేసులో రామ్ పాల్ తన భార్య దులారో దేవితో కలిసి గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారు కొడుకు సోమ్ పాల్ హర్యానాలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. అతను 8 రోజుల క్రితమే గ్రామానికి తిరిగి వచ్చాడు. జూలై 24 రాత్రి నుంచి తన తండ్రి కనిపించకుండా పోయారని సోమ్ పాల్ చెప్పాడు. తన తండ్రి ఆచూకీ కోసం ఎంతగానో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీని తరువాత.. జూలై 26 న పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేశారు. ఈ విషయంలో ఆ కొడుకు తన తల్లిపై అనుమానం వ్యక్తం చేశాడు. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో మహిళ తన నేరాన్ని అంగీకరించింది.
పోలీసుల విచారణలో రామ్ పాల్ తనను కొట్టేవాడని దులారో చెప్పాడు. జూలై 24 రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందనీ, వాగ్వాదం తీవ్రంగా కావడంతో తాను క్షణికావేశంలో గొడ్డలితో నరికివేశానని తెలిపారు. తలకు తీవ్ర గాయాలు అవడంతో రామ్ పాల్ మృతి చెందాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. గోనె సంచిలో వేసి కాలువలో పడేశానని తెలిపింది. హంతకురాలు తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం నాడు పోలీసులు కాలువ నుండి రక్తంతో తడిసిన బట్టలు, శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆమె ప్రేమికుడి కోసం వెతకడం ప్రారంభించారు.