ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. లక్నోలో ‘యువకే మాన్‌కీబాత్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంజనీరింగ్ విద్యార్ధులతో మాట్లాడిన ఆయన దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఓ విద్యార్ధి ప్రశ్నించాడు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. లక్నోలో ‘యువకే మాన్‌కీబాత్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంజనీరింగ్ విద్యార్ధులతో మాట్లాడిన ఆయన దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఓ విద్యార్ధి ప్రశ్నించాడు.

దీనికి సమాధానం చెబుతూ...ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్ధితులకు అడ్డుకట్ట పడుతుంది... ఉగ్రదాడులు ఒక దాని వెంట మరొకటి జరుగుతున్నాయి..

పుల్వామా ఆత్మాహుతి దాడి అత్యంత దారుణమైందంటూ’’ యోగి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆవేశంగా మాట్లాడిన ముఖ్యమంత్రి... పుల్వామా దాడి జరిగిన 48 గంటల్లోనే దీని సూత్రధారిని భారత బలగాలు హతమార్చాయన్నారు.

పుల్వామా ఘటనలో ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 12 మంది జవాన్లు అమరులయ్యారని తెలిపారు. దీంతో హాల్‌లోని విద్యార్థులంతా భారత్ మాతాకీ జై.. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు..

Scroll to load tweet…