Agra: ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. 

Bus Collides With Tanker: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జరుపుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో పడి ఉంటాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఆగ్రాలో ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆగ్రాలోని ఎత్మాద్‌పూర్‌లోని కుబేర్‌పూర్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ఫోర్ట్ డిపోకు చెందిన రోడ్‌వేస్ బస్సు ఫిరోజాబాద్ నుండి ఆగ్రాకు వస్తోంది. అందులో దాదాపు 30-35 మంది ప్రయాణికులు ఉన్నారని ఎత్మాద్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ రవి కుమార్ గుప్తా తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది.

ఈ ప్ర‌మాదం గురించి ప్ర‌యాణికులు మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోవడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదనీ, గాయపడిన వారు ఆగ్రాలోని సరోజనీ నాయుడు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు. ప్రయాణికుల్లో ఒక‌రు మాట్లాడుతూ.. 35-40 మంది ప్రయాణికులు ఉన్నారనీ, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో బస్సు ట్యాంకర్‌ను ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్ర‌మాదంలో త‌న నోటికి, మోకాలికి గాయాలయ్యాయ‌ని తెలిపారు. 

తెలంగాణ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు స్పాట్ డెడ్ 

తెలంగాన‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు ఆటోడ్రైవర్‌ జమీల్‌, రవి, కిషన్‌, సోనీబాయి అనే ముగ్గురు కూలీలుగా వికారాబాద్‌ పెదమూల్‌ మండలం మదంతాపూర్‌ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

డ్రైవర్ సహా 11 మంది వ్యక్తులు పని నిమిత్తం వికారాబాద్‌కు ఆటో రిక్షాలో వెళ్తుండగా ఆటో రిక్షాను లారీ ఢీకొట్టింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదుచేసుకున్నారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.