వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు తనకు తండ్రి నుంచి ప్రాణహనీ ఉందంటూ ఓ ఎమ్మెల్యే కుమార్తె సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా... ఈమే తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా వేరే సామాజిక వర్గానికి చెందిన అభితేష్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో గౌరవనీయులైన పప్పు భార్తౌల్.. మీరు మా మానాన మమ్మల్ని బతకనివ్వండి.. నేను నిజంగా పెళ్లి చేసుకున్నాను. ఫ్యాషన్ కోసం తాను బొట్టు పెట్టుకోలేదు.. నన్ను చంపడానికి మీరు కొందరిని పంపారు.

కానీ తాను వారి బారి నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు నాతో పాటు తన భర్త జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. నన్ను చంపేస్తారా...నా భర్త, అతని కుటుంబసభ్యులను హింసించడం ఆపండి....

నేను ఒక్కటే మీకు చెప్పదలచుకున్నాను.. భవిష్యత్తులో తన భర్తికి గానీ.... అతని బంధువులకు గానీ ఏమైనా హానీ జరిగితే దానికి నా తండ్రి, సోదరుడు విక్కీ బాధ్యులు. దయ చేసి తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు.

కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే స్పందించారు. తన కూతురి పెళ్లిన వ్యతిరేకించడం లేదని.. అయితే ఆమె తన కన్నా వయసులో 9 ఏళ్లు పెద్దయిన వ్యక్తిని పెళ్లాడటం మాత్రం తనకు నచ్చలేదని తెలిపారు.

ఒక తండ్రిగా తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నానని మీడియాకు వెల్లడించారు. తన బిడ్డకు హానీ చేయాలని తానెప్పుడూ ఆలోచించలేదని.. ఆమె తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.