Asianet News TeluguAsianet News Telugu

మంత్రికి కరోనా... క్వారంటైన్ లో ముఖ్యమంత్రి

కరోనా సోకిన మంత్రి సత్పాల్ మహారాజ్ శుక్రవారం ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో సీఎం త్రివేండ్రసింగ్ రావత్ తోపాటు మంత్రులందరినీ హోంక్వారంటైన్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి జేసీ పాండే చెప్పారు.

Uttarakhand minister Satpal Maharaj, family members test positive for coronavirus
Author
Hyderabad, First Published Jun 1, 2020, 8:58 AM IST

ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ కి కరోనా వైరస్ సోకింది. ఆయనతో పాటు ఆయన భార్య అమృతా రావత్, మరో 17 మంది కుటుంబసభ్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మంత్రి తోపాటు అతని కుటుంబసభ్యులను డెహ్రాడూన్ నగరంలోని సొంత ఇంట్లో క్వారంటైన్ చేశారు. మంత్రి ఇంట్లో పనిచేస్తున్న 17 మంది సిబ్బంది, కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. 

కరోనా సోకిన మంత్రి సత్పాల్ మహారాజ్ శుక్రవారం ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో సీఎం త్రివేండ్రసింగ్ రావత్ తోపాటు మంత్రులందరినీ హోంక్వారంటైన్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి జేసీ పాండే చెప్పారు. మంత్రి దంపతులతోపాటు అతని ఇద్దరు కుమారులు, వారి భార్యలు, ఆరునెలల వయసున్న మనవడికి కూడా కరోనా వైరస్ సోకింది. మంత్రి భార్య అమృతరావత్ కు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో ఆమెను రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించామని మంత్రి ఓఎస్డీ అభిషేక్ శర్మ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios