నలుగురు వ్యక్తులు భగవాన్ మీద కిరాతకంగా దాడి చేసి స్టీల్ రాడ్ తో అతని eyesను కోశారు. ఆ తరువాత అతన్ని రెండంతస్తుల ఇంటిపైకప్పు పైకి లాగి.. కిందకు తోసేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 

డెహ్రాడూన్ : ఇటీవల కాలంలో చాలా చిన్న చిన్న విషయాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా Uttarakhand లోని నైనిటాల్ జిల్లాలో చేపలు ఉచితంగా ఇవ్వలేదని ఒక వ్యక్తిపై పైశాచికంగా దాడి చేసి హత్యకు కారణమయ్యారు కొందరు దుండగులు. 

అసలు విషయంలోకి వెడితే.. ఉత్తరాఖండ్ లో నైనిటాల్ జిల్లాలోని టోక్ నర్టోలా గ్రామంలో భగవాన్ సింగ్ పడియార్ fish sellerగా పనిచేసేవాడు. అయితే రాత్రి 7 గంటల ప్రాంతంలో నలుగురు స్థానికులు చేపల కొనుగోలు చేయడం కోసం అతని దుకాణానికి వచ్చారు. అయితే వారు చేపలు ఉచితంగా ఇమ్మంటూ గొడవ చేశారు. 

అందుకు చేపలమ్మే వ్యక్తి అంగీకరించలేదు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు భగవాన్ మీద కిరాతకంగా దాడి చేసి స్టీల్ రాడ్ తో అతని eyesను కోశారు. ఆ తరువాత అతన్ని రెండంతస్తుల ఇంటిపైకప్పు పైకి లాగి.. కిందకు తోసేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 

ఈ మేరకు స్థానికులు భగవాన్ ను చికిత్స నిమిత్తం హల్ద్వానీలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కానీ భగవాన్ ఆస్పత్రిలో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడుతూ చివరికి మరణించాడు. ఆ తర్వాత బాధితుడి మేనమామ గణేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నలుగురు నింితులమీద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆ తదనంతరం పోలీసులు నిందితులు శల్ సింగ్, సునీల్ జోషి, భూపాల్ సింగ్, చంచల్ సింగ్ లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇదే తరహాలో మహారాష్ట్రలో నాగాపూర్ లోని రెస్టారెంట్ లో చికెన్ సరిగా వడ్డించలేదంటూ గొడవ చేసి రెస్టారెంట్ కి నిప్పంటించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం విషాదం. 

రెండు రోజులు లాక్‌డౌన్ విధించండి..! ఇంట్లోనూ మాస్క్ ధరించే దుస్థితి.. సుప్రీంకోర్టు మండిపాటు

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సంతానం కోసం అని ఓ యువతిని బంధించిన ఓ వ్యక్తి ఆమెపై 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతని భార్య సహకరించడం గమనార్హం. చివరకు శిశువు జన్మించాక బాధితురాలిని ఈ నెల 6న బస్టాండ్ వద్ద పడేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

Ujjainలోని కథ్ బరోడా గ్రామానికి చెందిన రాజ్ పాల్ సింగ్(38), చంద్రకాంత 26 దంపతులు. గతంలో Rajpal Singh ఉప సర్పంచ్ గా పనిచేశాడు. వారి ఇద్దరు పిల్లలు ఏవో అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. పిల్లల కోసం 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మహిళ వద్ద నుంచి ఓ యువతి(21)ని కొనుగోలు చేశారు. 

young ladyని కొన్నప్పటి నుంచి victimని వారి ఇంట్లోనే బందీగా వుంచి రాజ్ పాల్ సింగ్ అనేక సార్లు rapeకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. pregnant అయిన యువతి గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది. కాగా ఈ నెల 6న అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దేవాస్ బస్టాప్ వద్ద పడేసి రాజగోపాల్ పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అమానుషాన్ని వారికి వివరించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం రాజబాబు దంపతులు సహా వారి ముగ్గురు బంధువుల పైన కేసు నమోదు చేశారు.