Asianet News TeluguAsianet News Telugu

వరద నీటితో ఉప్పొంగుతున్న ఈ నది ఉగ్రరూపం చూడండి (వీడియో)

మొన్నటివరకు దక్షిణాదిలోని కేరళ,కర్ణాటక లను అతలాకుతలం చేసిన వరదలు ఇప్పుడు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. డిల్లీ, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. నదులు, చెరువులు , కాలువలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
 
Uttarakhand flood
Author
Uttarakhand, First Published Sep 3, 2018, 3:35 PM IST

మొన్నటివరకు దక్షిణాదిలోని కేరళ,కర్ణాటక లను అతలాకుతలం చేసిన వరదలు ఇప్పుడు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. డిల్లీ, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. నదులు, చెరువులు , కాలువలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో ఈ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ఈ వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు ప్రమాదం పొంచివున్న ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

ఈ వరదల కారణంగా టెహ్రీ గర్హ్‌వాల్ జిల్లాలోని కెంప్టీ ఫాల్స్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహ ఉదృతి పెరగడంతో పోలీసులు పర్యాటకులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ ప్రవాహానికి సమీపంలోని హోటళ్లను,దుకాణాలు, నివాసాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

వీడియో

Follow Us:
Download App:
  • android
  • ios