కూతురి మొదటి పీరియడ్.. కేక్ కట్ చేసి గ్రాండ్ పార్టీ చేసిన కుటుంబ సభ్యులు !
period: ఉత్తరాఖండ్ లో ఒక కుటుంబం కేక్ కట్ చేసి కూతురి ఫస్ట్ పీరియడ్ సెలబ్రేట్ చేసుకున్నారు. 'రుతుస్రావం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది' అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి ఓ తండ్రి తన కుమార్తె మొదటి పీరియడ్ ను ఇంటిని అలంకరించి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
First Period Celebrations: నేటికీ ప్రజలు పీరియడ్స్ అంటే రుతుక్రమం గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారు. పీరియడ్స్ సమయంలో మహిళలు వంటగదికి వెళ్లడానికి అనుమతించరు, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాకూడదని చెబుతుంటారు.. కానీ ఈ అపోహను బ్రేక్ చేస్తూ, ఉత్తరాఖండ్‌లో జితేంద్ర భట్ కేక్ కట్ చేసి తన కుమార్తె మొదటి పీరియడ్‌ను వేడుకగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి కూతురి ఫస్ట్ పీరియడ్ సెలబ్రేట్ చేసుకున్నారు. 'రుతుస్రావం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది' అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి ఓ తండ్రి తన కుమార్తె మొదటి పీరియడ్ ను ఇంటిని అలంకరించి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ లో ఓ కుటుంబం తమ కుమార్తె మొదటి పీరియడ్ ను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. ఉధమ్ సింగ్ నగర్ లోని కాశీపూర్ నగరానికి చెందిన జితేంద్ర భట్ అనే వ్యక్తి తన కుమార్తె మొదటి పీరియడ్ ను పురస్కరించుకుని తన ఇంటిని బెలూన్లతో అలంకరించాడు. వృత్తిరీత్యా సంగీత ఉపాధ్యాయుడైన జితేంద్ర భట్ "రుతుస్రావం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది" అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి ఇటువంటి చర్య తీసుకున్నారు.
''నా చిన్నప్పుడు దీని గురించి పెద్దగా తెలియదు. నేను పెద్దయ్యాక, పీరియడ్స్ ఉన్నందుకు లేదా దాని గురించి మాట్లాడినందుకు మహిళలు, బాలికలను చిన్నచూపు చూడటం నేను గమనించాను. ఈ సమయంలో స్త్రీ దేనినైనా తాకితే అది అపవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ అపోహలన్నింటినీ తొలగించడానికి నా కుమార్తె మొదటి పీరియడ్ జరుపుకోవాలని అనుకున్నాను. ఇది మలినాలు, అంటరానితనం అనే వ్యాధి కాదని, సంతోషకరమైన రోజు'' అని బాలిక తండ్రి అన్నారని ఇండియా టూడే నివేదించింది. పీరియడ్స్ అనేది వ్యాధి కాదు.. మహిళ జీవితంలో భాగమనే సందేశాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేశారు.
జితేంద్ర చొరవతో స్థానికులు కూడా సంతోషంగా ఉన్నారనీ, ఈ చొరవ ఫలిస్తుందని, పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అపవిత్రులు అవుతారనే అపోహను తొలగించడానికి సహాయపడుతుందని అన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ నవప్రీత్ కౌర్ ప్రకారం "ఇది చాలా మంచి చొరవ, ఎందుకంటే ప్రజలు దీనిని అంటరానితనంగా భావించే విధానం పూర్తిగా తప్పు. ఇది వ్యాధి కాదు, అంటరానితనం కాదు. పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ స్నానం చేసి, పూజలు చేసి, ప్రతిరోజూ గుడికి వెళ్లవచ్చు'' అని అన్నారు.
పీరియడ్ థీమ్‌పై డిజైన్ చేసిన కూతురు కేక్‌ను జితేంద్ర తీసుకువచ్చారు. కేక్ రంగును తెలుపు, ఎరుపుగా ఉంచారు.. కానీ కేక్ మీద "హ్యాపీ పీరియడ్స్ రాగిణి" అని వ్రాయమని జితేంద్ర కేక్ తయారీదారుని కోరినప్పుడు, అతను అతని వైపు వింతగా చూస్తూ, "నేను మొదటి సారి అలాంటి కేక్ చేస్తున్నానని చెప్పినట్టు పేర్కొన్నారు. రాగిణి పీరియడ్ పార్టీ ఫోటోలను జితేంద్ర ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. హ్యాపీ పీరియడ్ రాగిణి అంటూ చేసిన పోస్టులు చాలా మంది ప్రశంసలు పొందింది. గర్వించదగిన క్షణమని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ఒక గొప్ప చొరవ అంటూ కొనియాడారు.