Ganesh Godiyal: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గోడియాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట్లో నవ్వులపాలైంది. తన ట్విటర్ లో పోస్టు చేసిన ఫొటో తెగ వైరల్ అవుతున్నది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దొరికిపోయాడు. నెటిజన్స్ చేత చీవాట్లు తింటున్నారు.
Ganesh Godiyal: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గోడియాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట్లో నవ్వులపాలైంది. తన ట్విటర్ లో పోస్టు చేసిన ఫొటో తెగ వైరల్ అవుతున్నది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దొరికిపోయాడు. నెటిజన్స్ చేత చీవాట్లు తింటున్నారు.
ఇంతకీ ఆయన చేసిన ఘన కార్యమేమిటంటే..?
భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 25 న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో వృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశ వారసత్వ సంపదం, కట్టడాలను సందర్శించడానికి ప్రపంచ దేశాల పర్యటకులు పెద్ద ఎత్తున మన దేశానికి వస్తోన్నారు. దీంతో ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగం అభివృద్ది కోసం ఎంత ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తాయి.
ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గోడియాల్.. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్బంగా.. ఓ ఫోటోను పోస్టు చేసి..రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ పర్యాటక దినోత్సవం శుభాకాంక్షలు. అంటూ ట్వీట్ చేశారు.
అంతబాగానే ఉందిగా అనుకుంటే.. అక్కడే పొరపాటు జరిగింది. ఆయన పోస్టు చేసిన ఫోటోలో భారతదేశం అత్యధిక మంది పర్యాటకులు విచ్చేసే.. పర్యటక ప్రదేశాలైన ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న ఎర్రకోట, ఇండియా గేట్ (India gate), ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహాల్ , కుతిబ్ నార్ తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇటలీలోని పీసా టవర్ కూడా భారతదేశంలో ఉన్నట్టు ఫోటోలో డిజైన్ చేయించారు.
ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నది. ఆయన చేసిన పోస్టు చేసిన ఫోటోపై ట్రోలింగ్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.
ఇక కొందరూ నెటిజన్స్ చీవాట్లు పెడుతున్నారు. అసలు ఇండియాకు ఇటలీలోని పిసా టవర్ కు సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరతే.. కాంగ్రెస్ వారికి ఇటలీ అన్న.. అటు సోనియా అన్నచాలా ఇష్టం అంటు కామెంట్స్ చేశారు. ఇండియాకు పీసా టవర్ ఎప్పుడు వచ్చిందని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరూ సోనియాగాంధీ మీద అభిమానంతో ఇటలీలోని పిసా టవర్ ను ఇండియాకు తెచ్చినట్టు ఉన్నారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టు.. విపక్షలకు ఆయుధంగా దొరికింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ప్రచారం విమర్శస్త్రంగా వాడే అవకాశం లేకపోలేదు.
