డెహ్రడూన్:ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం నాడు రాజీనామా చేశారు. గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఆయన అందజేశారు.

సోమవారం నాడు రావత్ ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశారు. సీఎం మార్పు విషయమై సాగుతున్న నేపథ్యంలో సీఎం హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

ఢిల్లీ టూర్ తర్వాత సీఎం మార్పు విషయమై తాను హస్తినలో పర్యటించలేదని రావత్ ప్రకటించారు.  ఈ ఘటన జరిగిన మరునాడే  రావత్ రాజీనామా చేశారు. రావత్ తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

బుధవారం నాడు బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బీజేపీ శాసనసభపక్ష నేతను ఎన్నుకొంటారు.  సీఎం పనితీరు సరిగా లేదని పార్టీ నాయకత్వానికి పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఎం ను మార్చాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు రావత్ ఇవాళ రాజీనామా చేశారు.

త్రివేంద్ర సింగ్ రావత్ మంత్రి వర్గంలో మంత్రిగా కొనసాగుతున్న ధన్‌సింగ్ రావత్ కు సీఎం  పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.