ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ’నేను బాగానే ఉన్నాను. సమస్యలేమీ లేవు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నాను’ అని ట్వీట్ చేశారు.

గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు.. కరోనా బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో కుంభమేళా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు. ఇటీవల కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటించిన సందర్శంగా లేవనెత్తిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కుంభమేళాలో కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 1నుంచి కుంభమేళా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.