యూపీలో టీనేజ్ బాలిక కిడ్నాప్.. కర్ణాటకలో రెండు నెలలుగా బంధించి..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన టీనేజ్ బాలికను ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ బాలికను కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ రెండు నెలల పాటు నరకం చూపించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యూపీ పోలీసులు ఆ నిందితుడ్ని ట్రాక్ చేసి.. ఆ యువతిని కాపాడారు.
సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ఆడవారిపై రోజురోజుకూ కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్నా..పెద్దా.. అన్న తేడా లేకుండా.. ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. కొందరూ మగవాళ్లు మ్రుగాళ్లలా పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా నిత్యం ఏదో ఒకచోట ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వాలు ఎన్ని కఠినతర చట్టాలు అమల్లోకి తీసుకవచ్చినా.. ఎంత దారుణ శిక్షలు విధించినా.. కీచకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. టీనేజీ బాలికను కిడ్నాప్ చేసి.. కర్ణాటకకు తీసుకెళ్లాడు. ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా రెండు నెలల పాటు నరకం చూపించారు. ఆ యువతిని బంధించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకుని కిడ్నాప్‌కు గురైన మైనర్ బాలికను విడిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఉభాన్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలోని ఉభాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన రాహుల్ నిషాద్ (20) యువకుడు ఆగస్టు 14వ తేదీ రాత్రి కిడ్నాప్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చూసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కిడ్నాప్ చేసిన యువకుడు ఆ బాలికను కర్ణాటకకు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
బెంగుళూర్ కు చేరుకున్న యూపీ పోలీసు స్పెషల్ టీం ఆయన యువకుడ్ని మంగళవారం బిల్త్రా రోడ్‌వేస్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని రక్షించి , నిందితుడు రాహుల్‌ను అరెస్టు చేశారు. రాహుల్ తనను కిడ్నాప్ చేసి కర్ణాటకకు తీసుకెళ్లి దాదాపు రెండు నెలల పాటు అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ మిశ్రా తెలిపారు.