Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ డే పరేడ్‌లో అయోధ్య రామ మందిరం

గణతంత్ర వేడుకల్లో అయోధ్య రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తమ శకటంగా అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని రూపొందించనున్నారు. 

Uttar Pradeshs Republic Day Tableaux To Showcase Ayodhya Ram Temple ksp
Author
New Delhi, First Published Dec 12, 2020, 4:03 PM IST

గణతంత్ర వేడుకల్లో అయోధ్య రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తమ శకటంగా అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని రూపొందించనున్నారు.

దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా తీర్చిదిద్దనున్నారు. ‘అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్’ పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

యూపీ ప్రభుత్వం పంపిన రామమందిర శకట ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం లభించింది. ‘సర్వ ధర్మ సమాభావ్‌’ థీమ్‌తో ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.   

2017లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అయోధ్యలో ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సరయూ నదీ తీరాన ‘దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది దీపోత్సవంలో భాగంగా ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో రామ జన్మభూమి వెలిగిపోయింది. ప్రభుత్వ శ్రమకు గుర్తుగా ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ రికార్డు కూడా లభించింది.   

Follow Us:
Download App:
  • android
  • ios