Asianet News TeluguAsianet News Telugu

యువతిపై రెండేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యాచారం, వీడియో తీసి బ్లాక్ మెయిల్...కొడుకు కూడా తోడవ్వడంతో....

చివరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేని ఆ యువతి గంగా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

Uttar Pradesh woman, allegedly raped repeatedly by traffic police constable, attempts suicide
Author
Hyderabad, First Published Sep 14, 2021, 9:59 AM IST

ఉత్తర ప్రదేశ్ : అతనొకట్రాఫిక్ కానిస్టేబుల్. చట్టాల గురించి, సమాజం గురించి బాగా తెలుసు.  అయినా మేనకోడలితో పాశవికంగా ప్రవర్తించాడు. సొంత కూతురిలా చూసుకోవాల్సి యువతి పాలిట శాపంలా మారాడు.  యువతిపై కన్నేసిన మేనమామ కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటనను వీడియో తీయించి బ్లాక్మెయిల్ చేస్తూ రెండేళ్లుగా యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.  

చివరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేని ఆ యువతి గంగా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. గత  రెండేళ్లుగా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పదేపదే అత్యాచారానికి పాల్పడుతూ ఉండడం, అదే విధంగా అతని కొడుకు వేధింపులు కూడా పెరగడంతో 20 ఏళ్ల యువతి ఆదివారం గంగలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్జాపూర్ జిల్లాకు చెందిన ఓ యువతి, ఆమె కుటుంబాన్ని మామ అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ 2019  జనవరిలో జరిగిన కుంభానికి అలహాబాద్ కు పిలిపించాడు.  ఈ క్రమంలో యువతి పై కన్నేసిన మామ…  ఓ రోజు హోటల్కు తీసుకెళ్లాడు.  అక్కడ యువతికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి  ఆమెపై అత్యాచారం చేశాడు.

ఆ సమయంలో బ్లాక్మెయిల్ చేయడానికి ఓ వీడియో కూడా తీశాడని మహిళా ఫిర్యాదులో పేర్కొంది.  ఈ వీడియో తో  మామ తనను  రెండేళ్లుగా  బ్లాక్ మెయిల్ చేస్తూ  అలహాబాద్,  కాన్పూర్ హలో  అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పేర్కొంది.  ఈ క్రమంలో గర్భవతి అవడంతో... గర్భస్రావం కోసం  ఒక మాత్ర కూడా ఇచ్చాడని ఆమె పేర్కొంది.

గర్ల్ ఫ్రెండ్ ని వెతికిపెట్టండి సర్.. ఎమ్మెల్యేకి యువకుడి లేఖ..!

అక్కడితో వదిలిపెట్టకుండా  నిందితుడు,  అతని కుమారుడు ఆదివారం మళ్లీ  కాన్పూర్ కి పిలిపించి  గదికి తీసుకెళ్లారని,  లైంగికంగా వేధిస్తూ అక్కడ కూడా మరొక వీడియో తీశారని మహిళ పేర్కొంది. ఈ విషయాన్ని చెబితే చంపుతామని తీవ్రంగా కొట్టారని తెలిపింది.  చివరకు వారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి నదిలోకి దూకినట్లు మిర్జాపూర్ డీసీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. 

అక్కడున్న గజ ఈతగాళ్లు,  సిబ్బంది సహాయంతో ఆమెను కాపాడినట్లు డీసీపీ తెలిపారు.  ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అతని కుమారుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.  మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని డిజిపి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios