లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  విషాదం చోటు చేసుకొంది. పొలానికి వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడ్డారు. ఓ చెట్టుకు ఇద్దరు బాలికలు ఉరేసుకొన్నారు. ఈ ఘటన యూపీలో విషాదాన్ని నింపింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్‌లోని మావో తహసీల్ ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. గురువారం నాడు ఇద్దరు బాలికలు పొలానికి వెళ్లారు. ఎంతసేపటికి వారు ఇంటికి తిరిగి రాలేదు  వారిని వెతుక్కొంటూ కుటుంబసభ్యులు వెళ్లారు. మార్గమధ్యలో ఓ చెట్టుకు ఇద్దరు బాలికలు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు చూసి షాక్‌కు గురయ్యారు.

వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. 2014లో కూడ ఇదే రాష్ట్రంలోని బదౌన్‌లో కూడ అక్కాచెల్లెళ్లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.