Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ లీడ‌ర్, బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కన్నుమూత‌.. ప్రధాని మోడీ స‌హా ప్ర‌ముఖుల నివాళి

 Lucknow: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు స్పీకర్ గా పనిచేసిన కేసరి నాథ్ త్రిపాఠి, చేతి విరగడంతో పాటు వృద్ధాప్య సంబంధిత రుగ్మతలు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు.
 

Uttar Pradesh : Senior BJP leader and Former Bengal Governor Kesari Nath Tripathi passes away
Author
First Published Jan 8, 2023, 12:46 PM IST

Former Bengal Governor Kesari Nath Tripathi: బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కన్నుమూశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా అనేక మంద్రి ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు స్పీకర్ గా  పనిచేసిన కేసరి నాథ్ త్రిపాఠి, చేతి విరగడంతో పాటు వృద్ధాప్య సంబంధిత రుగ్మతలు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆదివారం నాడు తుదిశ్వాస విడిచార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ మాజీ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి (88) ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు స్పీకర్‌గా పనిచేసిన సీనియర్ బీజేపీ నాయకుడు, చేతి విరగడంతో పాటు వృద్ధాప్య సంబంధిత రుగ్మతలు, శ్వాస సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారని పార్టీ నాయకుడు ఒక‌రు పేర్కొన్నారు. "త్రిపాఠిజీ కొద్దిసేపు ICUలో ఉన్నారు. అతని పరిస్థితి మెరుగుపడింది, ఆ తర్వాత ఆయనను ఇంటికి తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు" అని ఒక అధికారి తెలిపారు. 


నవంబర్ 10, 1934న అలహాబాద్‌లో జన్మించిన త్రిపాఠి జూలై 2014 నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. అంతకు ముందు, ఆయ‌న‌ బీహార్, మేఘాలయ,  మిజోరాం గవర్నర్‌గా స్వల్ప కాలానికి అదనపు బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. 1977-1979 మధ్య కాలంలో జనతా పార్టీ హయాంలో రాష్ట్రంలో సంస్థాగత ఆర్థిక, అమ్మకపు పన్నుల కేబినెట్ మంత్రిగా ప‌నిచేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాసనసభకు ఆరుసార్లు సభ్యుడిగా ఉన్నారు. కవి, రచయిత గుర్తింపు పొందారు. త్రిపాఠి అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కొంతకాలం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ తన బాధను వ్యక్తం చేస్తూ, ఉత్తరప్రదేశ్‌లో కాషాయ పార్టీని నిర్మించడంలో త్రిపాఠి కీలక పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. ఆయ‌న నివాళులు అర్పించారు. “శ్రీ కేస‌రి నాథ్ త్రిపాఠి జీ తన సేవ-తెలివితేటలతో ప్ర‌త్యేక‌ గౌరవం పొందారు. రాజ్యాంగ విషయాలలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. యూపీలో బీజేపీని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ప్రగతికి కృషి చేశారు. ఆయన మరణం ఎంతో బాధ‌పెట్టింది. ఆయన కుటుంబానికి నా సంతాపం.. ఓం శాంతి' అని మోడీ ట్వీట్ చేశారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios