Asianet News TeluguAsianet News Telugu

హిజ్రా ఇంట్లో దొంగతనం.. ఫేస్ బుక్ లో షేర్.. పట్టుకుని లోపలేసిన పోలీసులు.. !

కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫేస్బుక్ సాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.

Uttar Pradesh police arrest transgender for theft - bsb
Author
Hyderabad, First Published Jul 13, 2021, 9:48 AM IST

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ పోలీసులు ఫేస్బుక్ సహాయంతో ఇద్దరు దొంగలను పట్టుకుని జైలుకు తరలించారు. పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగపతి గ్రామానికి చెందిన హిజ్రా ఇంట్లో ఆరు లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. 

కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫేస్బుక్ సాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితులు గడిచిన తొమ్మిది రోజులుగా తమ లొకేషన్ మారుస్తూ వచ్చారు. పంజాబ్ ,హర్యానా, రాజస్థాన్ లలో తిరుగుతూ వచ్చారు. అయితే వీరి పై దృష్టిసారించిన పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఉదంతం గురించి ఎస్పి ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ  హిజ్రా రజనీ గుప్త ఇంట్లో చోరీ జరిగింది అన్నారు.

విలువైన బంగారు వెండి నగలు మాయమయ్యాయి అన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో... తన ఇంట్లో మరో ఇద్దరు హిజ్రాలు గత కొన్ని నెలలుగా ఉన్నారని, వారి పైన తనకు అనుమానం ఉందని పేర్కొంది.

దీంతో పోలీసులు నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు ఈ సమయంలో నిందితులు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశారు దీని ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి వారిని పట్టుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios