Asianet News TeluguAsianet News Telugu

భార్యతో వీడియో కాల్‌లో గొడవ.. గర్ల్‌ఫ్రెండ్ ముందే షూట్ చేసుకుని ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి తనతో దూరంగా ఉంటున్న భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆ వీడియో కాల్‌లో గొడవ జరిగింది. అప్పుడు ఆయనతో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉన్నది. ఆమె ముందే తుపాకీ తీసుకుని షూట్ చేసుకున్నాడు.
 

uttar pradesh man shoots self to death before girlfriend after argument with estranged wife kms
Author
First Published Sep 29, 2023, 6:55 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ భార్య భర్తలు వేరువేరుగా జీవిస్తున్నారు. ఇంకా విడాకులు తీసుకోలేదు. కానీ, వేరుబడి ఉంటున్నారు. ఆ భర్త మరో మహిళతో కలిసి జీవిస్తున్నారు. ఓ రోజు భార్యతో ఆయన వీడియో కాల్ మాట్లాడాడు. ఆ వీడియో కాల్‌లో ఇద్దరికీ గొడవ జరిగింది. అక్కడ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉన్నది. వేరుగా ఉంటున్న భార్యతో గొడవ పడ్డ ఆయన ఆగ్రహంతో తుపాకీ తూసి గర్ల్‌ఫ్రెండే కాల్చుకున్నాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లినా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యూపీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

ఈ ఘటన గురించిసర్కిల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు వైభవ్ పాండే మాట్లాడారు. మృతి చెందినవ్యక్తి పేరు సోను అని వెల్లడించారు. సోను ఆయనకు దూరంగా ఉంటున్న భార్యతో తన గర్ల్‌ఫ్రెండ్ ముందే వీడియో కాల్ మాట్లాడాడు. ఆ వీడియో కాల్‌లో సోనుకు, ఆయన భార్యకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ గొడవతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే కంట్రీ మేడ్ పిస్టల్ తీశాడు. తనపైనే ఎక్కుపెట్టుకుని షూట్ చేసుకున్నాడు.

Also Read: రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మహిళా రిజర్వేషన్ బిల్లు.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే తాము స్పాట్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు బృందం సోనును జిల్లా హాస్పిటల్ తరలించారు. కానీ, సోను అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios