ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడాన్ని ఓ విద్యుత్ లైన్‌మెన్ కు భారీ మొత్తంలో పోలీసులు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ లైన్ మెన్స్ ఆ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని థానాభవన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ట్రాఫిక్ పోలీసులు భారీమొత్తంలో చలాన్ విధించారని ఓ విద్యుత్ లైన్ మెన్ కోపోద్రిక్తుడైన పోలీస్ స్టేషన్ లోనే కరెంటును నిలిపివేశాడు. విద్యుత్ శాఖ ఉద్యోగికి ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో చలాన్ విధించినట్టు సమాచారం. అందుకే ఆ లైన్ మెన్ ఈ చర్య పాల్పడినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కోపోద్రిక్తుడైన లైన్‌మెన్ పోలీస్‌స్టేషన్ పవర్‌ను కట్ చేస్తూ కనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని థానాభవన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మెహతాబ్ అనే వ్యక్తి విద్యుత్ శాఖ లో కాంట్రాక్ట్ లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల మెహతాబ్ డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపారు. హెల్మెట్ ధరించకపోవడాన్ని ప్రశ్నించారు. తాను విద్యుత్ లైన్‌మెన్ అని, మరోసారి హెల్మెట్ లేకుండా వెళ్లనంటూ ప్రాథేయపడ్డాడు. అయితే అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలను లూఠీ చేస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులు అతడ్నిదూషించారు. ఈ క్రమంలో అతనికి రూ.6,000 జరిమానా విధిస్తూ.. చలానా ఇచ్చారు.
కాగా.. ఉత్తరప్రదేశ్ లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. రూ.2,000 జరిమానా విధిస్తారు. కానీ, మెహతాబ్‌కు రూ.6,000 జరిమానా ఎందుకు విధించారో అన్నది అర్థం కాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లైన్‌మెన్ మోహతాబ్ మరో సిబ్బందితో కలిసి థానా భవన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఆ పోలీస్ స్టేషన్‌లో విద్యుత్ శాఖకు రూ.వేలల్లో బకాయి ఉంది. దీంతో పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాలను నిలివేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇందులో షామ్లీలోని థానాభవన్ పోలీస్ స్టేషన్ వెలుపల ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభంతో పోలీస్ స్టేషన్ కనెక్షన్‌ను ఎలక్ట్రీషియన్లు కత్తిరించడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
