పదిహేనేళ్ల బాలిక తన తల్లి, కుటుంబ సభ్యులతో బదర్ పుర్ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగింది. ఆ సమయంలోఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందికి దిగారు.
అలీగఢ్ : ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) దారుణాలకు తెరపడట్లేదు. ఢిల్లీ నిర్భయ కేసు తరహాలో ఘోరం చోటు చేసుకుంది. పదిహేనేళ్ల బాలిక మీద స్లీపర్ బస్సు(Sleeper Bus)లో అత్యాచారం (Rape) జరిగింది. విషయం తెలిసి అడ్డుకోబోయిన తల్లిని లాగిపడేసి, కండక్టర్, హెల్పర్ పరారయిన ఘటన చోటు చేసుకుంది.
పదిహేనేళ్ల బాలిక తన తల్లి, కుటుంబ సభ్యులతో బదర్ పుర్ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగింది. ఆ సమయంలోఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందికి దిగారు. ఇదే అదనుగా భావించిన కండక్టర్ బబ్లూ అతని సహచరుడు అషు ... బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు.
బస్సు తిరిగి స్టార్ట్ అయ్యాక... ఈ ఘోరాన్ని బాలిక తన తల్లికి వివరించింది. దీంతో కోపోద్రిక్తురాలైన తల్లి.. బస్సు ఆపేందుకు ప్రయత్నించగా కండక్టర్ బబ్లు ఆమెను లాగి పడేసాడు. ఆ తరువాత బబ్లూ, అషు బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై శిఖోహాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అషును అరెస్ట్ చేశారు.
