ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పలితాలు బీఎస్పీని నిరాశపర్చాయి . ఈ ఎన్నికల్లో బీఎస్పీ తీవ్రమైన ఓటమిని దక్కించుకొంది. గతంలో వచ్చిన సీట్లను కూడా దక్కించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. 

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో BSP తీవ్రంగా దెబ్బతింది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఈ విషయం వెల్లడౌతుంది. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఎస్పీ ఈ దఫా మాత్రం తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని నెలకొంది. 

ఈ ఎన్నికల్లో కూడా గతంలో వచ్చిన ఓట్లు, సీట్లు కూడా దక్కే పరిస్థితి లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల గణాంకాలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి పోటీ చేసింది. 2017 ఎన్నికల్లో బీఎస్పీ 17 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 2017లో బీఎస్పీకి 22 శాతం ఓట్లు దక్కాయి. .2019లో 20.1 శాతం నుండి 36 శాతానికి పెరిగింది

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొంత కాలంగా బీఎస్పీ తన ఓటు బ్యాంకును కోల్పోతూ వచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్ో ఇతర పార్టీలతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకొంది. కానీ బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగింది.

యూపీ రాష్ట్రంలో 21 శాతం దళిత ఓటర్లుంటారు. గతంలో దళితులు, అగ్రవర్ణాల ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు దఫాలు యూపీలో బీఎస్పీ అధికారాన్ని చేపట్టింది., 2001 లో బీఎస్పీ అధ్యక్షురాలిగా Mayawati బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పలు పార్టీల కూటమితో కలిసి బీఎస్పీ అధికారాన్ని చేజిక్కించుకొంది. 

1992లో బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేశారు. అయితే ఈ సమయంలో అధికారంలో ఉన్న కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1993లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో SPతో బీఎస్పీ పొత్తు పెట్టుకొంది.ఆ సమయంలో ఎన్నికైన ప్రభుత్వంలో బీఎస్పీ అధికారాన్ని పంచుకొంది.ఈ ఎన్నికల్లో బీఎస్పీ 67 సీట్లు గెలుచుకుంది.

1995లో లక్నో గెస్ట్ హౌస్ లో మాయావతి సమావేశంపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేయడంతో ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎస్పీ ప్రభుత్వానికి ఆమె తన మద్దతును విరమించుకొంది. దీంతో బీజేపీ మద్దతుతో 24 గంటల్లోనే మాయావతి సీఎంగా ప్రమాణం చేశారు. ఏడాదిన్నర తర్వాత 1996లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి ప్రజలు మెజారిటీని ఇవ్వలేదు. దీంతో బీజేపీ మద్దతుతో మరోసారి బీఎస్పీ CM పీఠాన్ని దక్కించుకుంది. మాయావతి సీఎం పీఠంపై రెండోసారి కూర్చున్నారు. ఆరు మాసాల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య సీఎంలు మారాలనేది రెండు పార్టీల మధ్య ఒప్పందం. దీంతో మాయావతి సర్కార్ కుప్పకూలింది.

2002లో జరిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి కూడా ప్రజలు మెజారిటీని ఇవ్వలేదు. దీంతో బీజేపీ మద్దతుతో మాయావతి మూడో సారి సీఎంగా ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన 15 రోజులకే ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

2007 ఎన్నికల్లో బీఎస్పీ సోషల్ ఇంజనీరింగ్ ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టింది. దళితులు, అగ్రవర్ణాలను కలుపుకొని పోవడం ద్వారా బీఎస్పీ ఘన విజయం సాధించింది. 2007లో అధికారాన్ని చేపట్టిన మాయావతి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. 2012 ఎన్నికల్లో బీఎస్పీ 80 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కించుకొంది. సమాజ్ వాదీ పార్టీ చేతిలో బీఎస్పీ ఓటమి పాలైంది. 2007లో బీఎస్పీ 206 సీట్లు దక్కించుకొంది. అవినీతి ఆరోపణలు,దళిత ఓటు బ్యాంకును కాపాడుకోకపోవడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 19 సీట్లు మాత్రమే దక్కాయి. 2012 ఎన్నికల్లో గెలుచుకొన్న అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ 75 శాతం సీట్లను దక్కించుకొంది. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభమయింది. గ‌తంలో కంటే ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. అధికార పార్టీ బీజేపీ.. ప్ర‌తిప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ప్ర‌చారం సాగిస్తూ.. గెలుపు త‌మ‌దేనంటూ ధీమా వ్య‌క్తం చేశాయి. ఇక కాంగ్రెస్‌, బీఎస్పీలు సైతం గ‌త వైభ‌వం కోసం గ‌ట్టిగానే పోరాటం సాగించాయి. ఆయా పార్టీలు భ‌విత‌వ్యం మార్చి 10 తేల‌నుంది.


యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగింద‌ని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం త‌మ‌దైన త‌ర‌హాలో ప్ర‌చారం సాగిస్తూ.. ఎన్నిక‌ల బ‌రిలో ముందుకుసాగాయి. మొద‌టి విడుతలో 58 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌గా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ న‌మోదైంది. 2017 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ( 63.5 శాతం) త‌క్కువ‌గా ఉంది.

ఇక యూపీ రెండో విడత ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 50
శాతం కంటే అధిక ముస్లిం ఓట‌ర్లు ఈ ప్రాంతంలో ఉండ‌టంతో అన్ని పార్టీలు ఓట‌ర్ల‌కు గాలంవేసేలా ముందుకు సాగాయి. 61.20 శాతం ఓటింగ్ న‌మోదైంది. మూడో ద‌శ‌లో 16 జిల్లాల్లోని 59 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. 623 మంది బ‌రిలో నిలిచారు. కీల‌క‌మైన 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ద‌శలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్‌, శివ‌పాల్ యాద‌వ్ వంటి నేత‌లు పోటి ప‌డ్డారు. అలాగే, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాల‌కు నాల్గో ద‌శ‌లో పోలింగ్ జ‌రిగింది.

ఇక ఫిబ్ర‌వ‌రి 27న ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగింది. మొత్తం 692 మంది బ‌రిలోకి దిగ‌గా.. వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు, కేంద్ర మంత్రి అనుప్రియా ప‌టేల్ త‌ల్లి, అప్నాద‌ళ్ నేత కృష్ణా ప‌టేల్ అప్నాదళ్ కే త‌ర‌పున పోటీలో ఉన్నారు. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. ఇక సోమ‌వారం నాడు (మార్చి 7) ఏడోద‌శ (చివ‌రిద‌శ‌) ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. మొత్తం 9 జిల్లాల్లోని 54 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. 613 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.

ఇక ప్ర‌స్తుత యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ గోర‌ఖ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత (ఎస్పీ), మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కర్కల్ నియోజవర్గం నుంచి బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 47 సీట్లు, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 19 స్థానాల్లో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్ర‌ధాన పోటీ ఈ రెండు పార్టీల మ‌ధ్య ఉంటుంద‌ని ఇప్ప‌టికే ముందుస్తు అంచనాలు సైతం పేర్కొన్నాయి.