గ్రేటర్ నొయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

 ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ట్రక్కుపైకి దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంత గ్రేటర్ నొయిడా రబుపుర పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, పలువురు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.