లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు  విషాదం చోటు చేసుకొంది. విషవాయువు లీకై ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తెలిసిన వెంటనే అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో గురువారం నాడు ఉదయం టాక్సిక్ యాసిడ్ వెలువడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. టాక్సిక్ యాసిడ్ విడుదల కావడంతో ఏడుగురు కార్మికులు  మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టింది.