Asianet News TeluguAsianet News Telugu

13 ఏండ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం.. వీడియోతీసి బెదిరింపులు.. న‌లుగురు నిందితులు అరెస్టు

Uttar Pradesh: ఒక మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం చేయ‌డంతో పాటు దానికి వీడియోతీసి బెదిరింపుల‌కు పాల్ప‌డిన న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 

Uttar Pradesh:13-year-old girl gang-raped Video and threats. Four accused arrested
Author
First Published Sep 14, 2022, 11:11 AM IST

13-year-old girl gang-raped in UP: ఒక 13 ఏండ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ‌టంతో పాటు దానిని వీడియో తీసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. వేధింపుల‌ను తట్టుకోలేక బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంలో కేసు న‌మోదుచేసుకునీ, న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి హర్దుగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు తన పొరుగు మహిళ సహచరురాలు అని బాధిత‌లు పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్‌మీడియాలో ప్రసారం చేస్తానని నిందితులు తన కూతురిని బెదిరించాడని బాధితురాలి త‌ల్లి ఆరోపించింది. ముగ్గురు నిందితుల‌తో పాటు వారితో సంబంధం క‌లిగివున్న మ‌హిళ‌.. మొత్తం న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. 

బాధితురాలి కుటుంబం నుంచి అందిన ఫిర్యాదు మేరకు ముగ్గురు పురుషులు, ఒక మహిళపై ఐపీసీ సెక్షన్లు 376డి (గ్యాంగ్రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 342 (తప్పుడు కాన్ఫిగ్మెంట్), 120-బి (నేరపూరిత కుట్ర), పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ విశాల్ కుమార్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. 13 ఏళ్ల బాలికను ఆదివారం మధ్యాహ్నం నిందితురాలు తన ఇంటి వద్ద ఒక గదిలో బంధించింది. అక్కడ ముగ్గురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారు నేరాన్ని చిత్రీకరించారు. బాలిక‌ను సాయంత్రం ఇంటికి వెళ్ళటానికి అనుమతించారని అధికారులు తెలిపారు.

బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. "మేము ఫిర్యాదు చేయడానికి సమీపంలోని పోలీసు స్టేష‌న్ కు ఆదివారం నాడు వెళ్లాము. కాని అక్కడ ఉన్న పోలీసులు నిందితులతో రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. అయితే, సోమవారం నాడు  విషయం సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో వారు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నార‌ని" తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. (లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు). 

ఇదిలావుండ‌గా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజధాని భోపాల్ లో దారుణ షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఒక  స్కూల్ బస్సు డ్రైవర్ 3 ఏళ్ల  చిన్నారితో అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో మహిళా సహాయకురాలు ఆ డ్రైవ‌ర్ కు స‌హక‌రించ‌డం షాక్ గురిచేస్తోంది. మూడున్నరేళ్ల బాలికను మహిళా అటెండర్ సమక్షంలోనే లైంగికంగా వేధించారని, ఆమెకు రక్షణ కల్పించాల్సిన వారు మౌనంగా ఉండిపోయారని పోలీసులు తెలిపారు. అయితే, స‌ద‌రు డ్రైవ‌ర్ బ‌స్సులో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టం ఇదే మొద‌టిసారి కాక‌పోవ‌చ్చున‌ని షాకింగ్ న్యూస్ వెల్ల‌డించారు పోలీసులు. దీనిపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios