Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల పాటు అతడిని వాడుకొని. ఫారిన్ తీసుకెళ్తానని నమ్మించి.. చివరికి ఏం చేసిందంటే ?

స్పౌస్ వీసాపై అస్ట్రేలియా తీసుకెళ్తానని చెప్పి యువకుడితో లక్షలు ఖర్చుపెట్టించుకొని మోహం చాటేసింది ఓ యువతి. ఈ ఘటనలో బాధితుడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. తనను ఓ యువతి మోసం చేసిందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Using him for three years. Believing that the foreigner will take .. What did he do in the end?
Author
Punjab, First Published Dec 24, 2021, 12:39 PM IST

ఇదో కొత్త ర‌కం మోసం.. అబ్బాయిలే పెళ్లి చేసుకుంటాన‌ని అమ్మాయిల‌ను న‌మ్మించి అవ‌స‌రం తీరిపోయాక వ‌దిలిసేన ఘటనలు చూస్తుంటాం.  కానీ ఈ ఘ‌ట‌నలో మాత్రం మోస‌పోయింది ఒక అబ్బాయి. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఏకంగా అత‌డిని వాడుకొని ఏకంగా రూ.35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుపెట్టించుకుంది. చివ‌రికి నువ్వెవ‌రో తెలియదంటూ మోహం చాటేసింది. 

అత‌డికి ఫారెన్ వెళ్లాల‌ని క‌ల‌. అక్క‌డికి వెళ్లి జీవించాల‌ని అనుకున్నాడు. ఉన్న‌త విద్య కోసం వెళ్తే సులువుగా విసా దొరుకుతుంద‌ని భావించాడు. దాని కోసం ప‌రీక్ష కూడా రాశాడు. కానీ అందులో త‌క్కువ మార్కులు రావ‌డంతో వీసా రాలేదు. దీంతో విదేశం వెళ్లాల‌నే త‌న కోరిక‌కు బ్రేక్ ప‌డింది. అయితే అత‌డికి ఇంకో ఆలోచ‌న వ‌చ్చింది. ఆ ప‌రీక్ష‌లో మంచి మార్కులు సాధించిన యువ‌తిని పెళ్లి చేసుకోని ఆమె ద్వారా ఫారెన్ వెళ్లాల‌ని భావించాడు. అనుకున్న‌ట్టుగానే పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఉన్న‌త చ‌దువు కోసం అస్ట్రేలియా పంపించాడు. ఆమె చదువుక‌య్యే ఖ‌ర్చు మొత్తం భ‌రించాడు. డ‌బ్బులు స‌రిపోక‌పోతే అత‌డి ఆస్తిలో కొంత భాగం అమ్మి మ‌రీ ఆమెకు డ‌బ్బులు పంపించాడు. అంతా స‌వ్యంగా సాగిపోతుంద‌నుకున్న స‌మ‌యంలో ఆ యువ‌తి ఓ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అత‌డికి క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. చివ‌రికి ఆ య‌వకుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఇది వెలుగులోకి వ‌చ్చింది. బాధితుడు పోలీసుల‌కు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం...

అమానవీయం.. సెల్ ఫోన్ దొంగిలించాడంటూ, బట్టలూడదీసి తలకిందులుగా వేలాడదీసి...

పంజాబ్‌కు చెందిన హ‌రిప్రీత్ సింగ్‌కు అస్ట్రేలియా వెళ్లి జీవించాల‌ని కోరిక‌. దాని కోసం IELTS ప‌రీక్ష రాశాడు. అందులో మంచి స్కోర్ రాక‌పోవ‌డంతో వీసా రిజెక్ట్ అయ్యింది. దీంతో స్పౌస్ వీసాతో అస్ట్రేలియా వెళ్లాల‌ని అనుకున్నాడు. IELTSలో మంచి మార్కులు సాధించిన యువ‌తి అమ‌న్‌జ్యోత్ ను 2018లో పెళ్లి చేసుకున్నాడు. చ‌దువుకయ్యే ఖ‌ర్చు మొత్తం తానే భ‌రిస్తాన‌ని మాటిచ్చాడు. 2019లో ఆమెను అస్ట్రేలియాకు పంపించాడు. అనుకున్నట్టుగానే మూడేళ్ల పాటు ఆమె చ‌దువుక‌య్యే ఖ‌ర్చు మొత్తం భ‌రించాడు. ఒక సంద‌ర్భంలో త‌న ఆస్తి అమ్మి రూ.35 ల‌క్ష‌లు ఆమె చేతికి ఇచ్చాడు. కానీ ఏమైందో తెలియ‌దు గానీ అత‌డిని జీవితభాగ‌స్వామి వీసాపై అస్ట్రేలియా తీసుకెళ్ల‌డానికి ఆమె ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. రెండు సార్లు వీసా కోసం అప్ల‌య్ చేసుకున్న‌ప్ప‌టికీ ఆ యువ‌తి త‌మ‌కు పెళ్లి కాలేద‌ని చెప్ప‌డంతో అది రిజెక్ట్ అయ్యిందని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. దీంతో పోలీసులు ఆ యువ‌తిపై, ఆ కుటుంబానికి చెందిన మ‌రో ఇద్దరిపై కేసు న‌మోదు చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు గ‌తంలో కూడా జ‌రిగాయి. స్పౌస్ వీసా ఇప్సిస్తామ‌ని చెప్పి చ‌దువ‌క‌య్యే ఖ‌ర్చునంతా వారితో పెట్టించి, అక్క‌డికి వెళ్లిన త‌రువాత తమ‌కు పెళ్లి కాలేద‌ని చెప్పిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇలాంటి విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసులు తెలిపారు. పెళ్లిల పేరుతో మోసాలు జ‌రుగుతున్నాయ‌ని అన్నీ ఆలోచించే నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios