Asianet News TeluguAsianet News Telugu

వావ్! బుల్లెట్ ప్రూఫ్ కార్లను విడిచి..  ఆటోలో చక్కర్లు కొట్టిన అమెరికా మహిళా దౌత్యవేత్తలు 

గత నాలుగు రోజులుగా నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.  ఈ వీడియోలో నలుగురు అమెరికన్ మహిళా దౌత్యవేత్తలు దేశ రాజధానిలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సెక్యూరిటీ సిబ్బందిని వదిలి.. స్వయంగా ఆటో నడుపుతూ వెళ్లడమే ఇందుకు కారణం. మహిళా దౌత్యవేత్తలు ఈ టూర్ కు సంబంధించి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

US women diplomats ditch cars, drive auto on Delhi road
Author
First Published Nov 24, 2022, 3:28 PM IST

గత కొన్ని రోజులుగా ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో అమెరికా కు చెందిన నాలుగు మహిళలు ఆటోలో తిరుగుతూ.. పుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఆ వీడియోలో కనిపించే వారు సాధారణ మహిళలు కాదు.. వారంతా అమెరికా దౌత్యవేత్తలు. అమెరికా దౌత్యవేత్తలేంటీ..? వారు ఆటో నడపడమేంటీ? అని భావిస్తున్నారా..?  నమ్మ బుద్ది కావడం లేదా..? నిజంగానే వారందరూ అమెరికా దౌత్యవేత్తలు.. ఆటో నడిపించాలనేది వారి చిరకాల స్వప్నం. దీంతో ఆ కోరికను భారత్ లో తీర్చుకున్నారు.

దేశ రాజధాని రోడ్లపై వారే స్వయంగా ఆటో రిక్షాలు నడుపుకుంటూ.. ఢిల్లీ అందాలను ఆస్వాధీస్తున్నారు. అంతేకాదు..తమ  కార్యాలయాలకు, ఇతర పనుల కూడా..ఆ ఆటోను ఉపయోగిస్తున్నారు. వారే.. ఎన్. ఆలే. మాసన్, షరీన్ J. కిట్టర్‌మాన్, రూత్ హోంబర్గ్ మరియు జెన్నిఫర్ బైవాటర్స్.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, భద్రతా సిబ్బందిని వదిలి ఈ మహిళా దౌత్యవేత్తలు ఆటోల్లో ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు. ప్రజలు వారిని చూసి ఆశ్చర్యపోతున్నారు. భారత సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని అంటున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ మహిళలందరూ తమ పనుల కోసం .. ఆటోను స్వయంగా నడుపుకుంటూ ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీనితో పాటు, భారతీయ సంబంధాలను బలోపేతం చేయడం , ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రజలకు సందేశం ఇవ్వడం ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. 

ఆటోల్లో అమెరికా దౌత్యవేత్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దౌత్యవేత్త మేసన్ మాట్లాడుతూ, "నాకు ఆటో రిక్షాలంటే చాలా ఇష్టం. నేను పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు.. అక్కడ  ఆటోలలో ప్రయాణించడానికి ప్రయత్నించాను. కానీ.. ఆ అవకాశం అక్కడ దొరకలేదు. నేను భారతదేశానికి వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. వెంటనే రిక్షా కొనుక్కున్నాను. ఇప్పుడు ఆటోలోనే  ప్రయాణిస్తున్నాను." అని పేర్కొంది. మహిళా దౌత్యవేత్తలు ఆటో డ్రైవింగ్ అనుభవం చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. చాలా కొత్త విషయాలు చూసి నేర్చుకోవాలని అంటున్నారు.  

నా కల నిజమైంది

అమెరికా దౌత్యవేత్త షరీన్ మాట్లాడుతూ.. "నేను అమెరికా నుండి ఢిల్లీకి రావాలని అనుకున్నప్పుడు, ఆటో ఉన్న మెక్సికన్ అంబాసిడర్ గురించి విన్నాను. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత, N. L. మేసన్ తన ప్రయాణం కోసం ఇక్కడ ఒక ఆటోను ఉంచడం చూశాను. దీనిపై నేను ఆటోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను . నా కల కూడా నెరవేరింది. అని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios