US Independence Day 2022: అమెరికా ప్ర‌తి ఏటా జులై 4  స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుక‌లను జ‌రుపుకుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...

US Independence Day 2022: అగ్రరాజ్యం అమెరికా ప్ర‌తి ఏటా జులై 4 స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుక‌లను జ‌రుపుకుంటుంది. అమెరికా కూడా బ్రిటీష్‌ పాలనలో ఎన్నో ఏండ్లు అణిచివేతకు గురైంది. అనేక తిరుగుబాట్ల అనంత‌రం.. 1776 జులై 4న అమెరికాకు స్వాతంత్య్రం సాధించుకుంది. అగ్రరాజ్యం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంది. అప్పటి నుంచి సంవ‌త్స‌రం జులై 4న స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ వేడుక‌లు చాలా అట్ట‌హాసంగా జ‌రుగుతాయి. బాణ సంచాలు పేలుస్తూ.. స్వీట్లు పంచుతూ.. చాలా ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. అయితే. గ‌త రెండు ఏళ్ల‌ నుంచి కరోనా కారణంగా అమెరికా అగ్ర రాజ్యం స్వాతంత్య్ర దినోత్సవాన్ని చాలా సాదాసీదాగా నిర్వ‌హిస్తోంది.

ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...

>> అమెరిక‌న్లు ప్రతి ఏటా జూలై 4న స్వాతంత్య్ర‌ దినోత్సవం జరుపుకుంటారు. బ్రిటన్‌ కింగ్‌ జార్జ్‌.. స్వాతంత్య్ర‌ ప్రకటనపై సంతకం చేసినందున ఈ తేదీని ఎంచుకున్నారు. ఆ రోజున అమెరికన్లు వారు స్వేచ్ఛను పొందేందుకు పోరాడిన వీరుల పోరాటాల‌ను గుర్తు చేసుకుంటారు.

>> వాస్తవానికి..1776 జులై 2నే అమెరికాకు స్వతంత్రం వచ్చిందనీ చెప్పాలి. కానీ అందుకు కారణాలను వివరిస్తూ కాంటినెంటల్‌ కాంగ్రెస్‌.. బ్రిటన్‌ కింగ్‌ జార్జ్‌కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జులై 4న అధికారికంగా స్వాతంత్ర్య ప్రకటన చేశారు. కానీ అమెరికా రాష్ట్రాల సంతకాలు, ఇతర ప్రక్రియలు ఆగస్టు 2 వరకు సాగాయి.

>> వైట్ హౌస్ లో స్వాతంత్య్ర‌ వేడుకలు తొలిసారిగా 1801లో నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో అమెరికా దేశాధ్యక్షుడు థామస్‌ జఫర్సన్ ఉన్నారు. ఆయ‌న ఈ వేడుకలను ఘ‌నంగా నిర్వహించారు.

>>  జూలై 4 వ తేదీనే అమెరికాకు అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు ప్ర‌ముఖులు మరణించారు. అమెరికా మూడో అధ్యక్షుడిగా వ్యవహరించిన థామస్‌ జఫర్సన్‌.. అమెరికా స్వాతంత్య్ర‌ ప్రకటిస్తున్నట్లు తెలిపే ప్రకటనను రూపొందించారు. 

>>  యాదృచ్చికంగా థామస్‌ జఫర్సన్ స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున 1826లో జులై 4న మృతి చెందారు. అదేవిధంగా.. అమెరికా కు రెండో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్‌ ఆడమ్స్.. 1826 జులై 4 మ‌ర‌ణించారు. అలాగే.. 5వ అధ్యక్షుడిగా వ్యవహరించిన జేమ్స్‌ మొన్రే కూడా 1831 జులై 4 న మరణించారు. అలాగే.. అధ్యక్షుడు జాకరీ టేలర్ 1850లో జూలై 4 స్వాత్రంత్య వేడుకలో చెడిపోయిన పండ్లను తినడం వల్ల మరణించాడు.

>> తొలుత జూలై 2న స్వాతంత్య్ర‌ దినోత్సవం జరుపుకోనందుకు కోపంతో ఆడమ్స్ తన జీవితాంతం జూలై 4 వేడుకలకు ఆహ్వానాలను తిరస్కరించినట్లు నివేదించబడింది. 

>> మసాచుసెట్స్ 1781లో జూలై 4వ తేదీని అధికారిక రాష్ట్ర సెలవుదినంగా చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది.

>> అమెరికా జాతీయ జెండాలో స్టార్స్‌ ఇప్పుడు ఉన్న విధంగా ఉండేవి కావు. 1776నాటి జాతీయ పతాకంలోని వలయాకారంలో స్టార్స్‌ ఉండేవి. ఇలా ఉండ‌టం వ‌ల్ల అన్నీ రాష్ట్రాలు సమానమే అని భావన క‌లుగుతుంద‌ని రూపొందించార‌ట‌.

>> తొలుత స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడు సెలవు ఉండేది కాదు. 1870లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. జులై 4 ను సెలవు దినంగా ప్రకటించింది. అలాగే.. 1941 నుంచి వేతనంతో కూడిన సెలవుగా ప్ర‌క‌టించింది. 

>> అలాగే.. స్వాతంత్య్ర‌ దినోత్సవం సంద‌ర్భంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోబాణ సంచాలు కాలుస్తుంటారు. ఇవే.. ఈ వేడుకల‌కు ప్ర‌ధాన ఆకర్షణ. బాణసంచాల కోసం $8,000 నుంచి $15,000 ఖ‌ర్చుచేస్తార‌ట‌.

>> జులై 4న అమెరికన్ల్ హాట్‌డాగ్‌(సాండ్‌విచ్‌)ను తింటార‌ట‌.. ఈ ఒక్క రోజే సుమారు 15 కోట్ల హాట్‌డాగ్స్‌ను
తింటార‌ట‌. 

>> బ్రిటన్ నుండి అమెరికా 1776 లో స్వాతంత్య్ర‌ ప్రకటన రావ‌డంతో.. ఆ సంవత్సరానికి గుర్తుగా న్యూయార్క్‌లోని ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను 1,776 అడుగుల పొడవు తో నిర్మించారు.

>> హాలీవుడ్‌లో చాలా సినిమాలు స్వాతంత్ర‌ దినోత్సవం సందర్భంగా విడుదల చేయ‌డం అన‌వాయితీ గా వ‌స్తుంది.

>> అమెరికాలో 1875 లో న‌ల్ల జాతీయుల‌కు, అక్క‌డి అమెరిక‌న్ల‌కు మ‌ధ్య‌ అంతర్యుద్ధం జ‌రిగింది. దీంతో.. అప్ప‌టి నుంచి కొన్ని రాష్ట్రాల్లో నల్ల జాతీయులు జులై 4ను ‘బ్లాక్‌ ఫ్రీడమ్‌’గా జరుపుకొన్నారు.